హిందీ భాషా దినోత్సవంను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14న జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి , ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారని నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలోని అజీమ్ బ్రిలియంట్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ యం.ఎస్ అన్సర్ బాషా తెలిపారు. హిందీ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వక్తృత్వ , వ్యాసరచన పోటీలు నిర్వహించి అందులో ప్రథమ , ద్వితీయ మరియు తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో భాగంగా , హిందీ ఉపాధ్యాయులు నాయబ్ రసూల్ మరియు షాహిన గారు, హిందీ భాష ప్రాముఖ్యతను వివరంగా విద్యార్థులకు వర్ణించారు.. ఆధునిక హిందీని నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.