విద్యార్థులకు తాగునీటి సమస్య అనే వార్తకు స్పందించారు ఎంపీపీ బుగ్గన నాగ భూషణం రెడ్డి. బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామంలోగల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు, ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి ప్రత్యేక చొరవతో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్లు, విద్యార్థుల తల్లిదండ్రులు విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 6 నెలలుగా విద్యార్థులకు తాగునీటి సమస్య అనే శీర్షిక 15 రోజుల క్రితం (సెప్టెంబర్ 1 న)తెలుగుప్రభ దినపత్రిక మరియు పలు పత్రికలు ప్రచురించాయి. అందుకు స్పందించారు ఎంపీపీ బుగ్గన. నాగభూషణం రెడ్డి స్థానిక పాఠశాలను పరిశీలించి, అక్కడ ఉన్న పాఠశాల హెచ్ఎం మల్లికార్జున మరియు పాఠశాల సిబ్బందితో చర్చించి, వెంటనే తగు చర్యలు తీసుకొని విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, బాత్రూంలలో కొళాయిలు ఏర్పాటు చేయించినట్లు వారు తెలిపారు. విద్యార్థులకు త్రాగునీరు, మరుగుదొడ్లలో కుళాయిలు ఏర్పాటు చేపించినందుకు ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డికి, ఉన్నత విద్యాశాఖ అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Bethamcharla: ‘తెలుగుప్రభ’ దినపత్రిక ఎఫెక్ట్
తెలుగు ప్రభ కథనానికి స్పందించిన ఆర్ఎస్ రంగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బృందం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES