కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లిలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ మెడికల్ కళాశాల వర్చువల్ గా సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీని రేకుర్తిలోని కిమ్స్ కాలేజీ నుండి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించారు. దీనికి విద్యార్థులు , ప్రజలు భారీగా తరలివచ్చారు. కరీంనగర్ కు మెడికల్ కాలేజీ తెచ్చిన ముఖ్యమంత్రికి రాష్ట్ర పౌరసరఫరాల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీష్ బాబు, మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వర్చువల్ గా మెడికల్ కళాశాల ప్రారంభానికి ముందు ఈ ప్రదర్శన జరిగింది.