Friday, September 20, 2024
HomeతెలంగాణShamshabad: వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి

Shamshabad: వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి

శంషాబాద్ మునిసిపాలిటీ, ఛైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ తెలియజేయడమేమనగా శంషాబాద్ మున్సిపాలిటీలోని, మొయిన్ మొహల్లాలో వందల సంఖ్యలో కుక్కలు, పందులు వీధుల్లో తిరుగుతూ సామాన్యులకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. 6.సెప్టెంబర్ .2022న శంషాబాద్ మున్సిపాలిటీలో కుక్కలు, పందుల బెడదను తొలగించడానికి రూ.5,00,000/- మొత్తాన్ని కేటాయించారు; కానీ ఇంతవరకు అది మెటరైజ్ కాలేదు. మేకలపై కుక్కలు దాడి చేయడంతోపాటు చిన్న పిల్లలపై దాడి చేసేందుకు యత్నిస్తున్నాయి. ఈ కుక్కల గుంపుల కారణంగా రాత్రి వేళల్లో వీధుల్లోకి వెళ్లాలంటేనే సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కుక్కల దాడి వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కదులుతున్న ద్విచక్ర వాహనాలను కుక్కలు వెంటాడుతున్నాయి. కావున ప్రజల భద్రత దృష్ట్యా శంషాబాద్ మునిసిపాలిటీ నుండి ముఖ్యంగా మొయిన్ మొహల్లా ప్రాంతంలో వీధి కుక్కలు మరియు పందులను తొలగించడానికి దయచేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఐదో వార్డు కౌన్సిలర్.మస్రత్ జహాన్ తజ్బాబా తెలియజేయుచున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News