Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KTR in Sirisilla: రాజకీయ భవిష్యత్తు ఉన్నంతకాలం సిరిసిల్ల ప్రజలకు అండగా ఉంటా

KTR in Sirisilla: రాజకీయ భవిష్యత్తు ఉన్నంతకాలం సిరిసిల్ల ప్రజలకు అండగా ఉంటా

సిరిసిల్లలో కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది ప్రభుత్వ కళాశాలను వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం రోజు ప్రారంభించారు.సిరిసిల్ల మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు.అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాజకీయ భవిష్యత్తు ఉన్నంతకాలం సిరిసిల్ల ప్రజలకు అండగా ఉంటాం అంటూ ప్రసంగించారు.వైద్య విద్య పటిష్టతతో పాటు పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభత్వానికి ఉన్నకమిట్ మెంట్ కు నిదర్శనం, జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటేనని మంత్రి కేటీఆర్ అన్నారు. సిఎం కేసీఆర్ మెడికల్ కాలేజీలను ప్రారంభించి ప్రసంగం ఇచ్చిన అనంతరం మంత్రి కే తారక రామారావు మెడికల్ కాలేజీల అధ్యాపకులు,వైద్య విద్యార్థులతో మాట్లాడారు. స్వరాష్ట్రం ఏర్పాటైన వెంటనే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో ఏటా 10 వేల మంది విద్యార్థులు వైద్య విద్య పూర్తి చేసుకుని డాక్టర్ లుగా బయటకు వస్తున్నారని చెప్పారు. దేశంలో 33 శాతం మంది వైద్య విద్యార్థులు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే వస్తున్నట్లు తెలిపారు. 1993 లో తాను బయాలజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఎంసెట్ రాస్తే 1600 ర్యాంకు వచ్చిందని, అయినా మెడిసిన్ సీట్ రాలేదన్నారు.

- Advertisement -


మా అమ్మకు డాక్టర్ కావాలని, నాన్నకు ఐఏఎస్ కావాలని ఉండేదన్నారు. ఆ రెండూ కాకుండా ప్రజాప్రతినిధి అయ్యాయని చెప్పారు. ఇప్పుడు 10 వేల ర్యాంకు వచ్చినా తెలంగాణలో మెడికల్ సీటు వస్తుందన్నారు.ఈ ప్రాంతంలో 2009 సంవత్సరంలో డిగ్రీ కాలేజ్ పంచాయతీ ఏర్పాటు ఉండేది అన్నారు. సిరిసిల్లలో పెట్టాలని, వేములవాడలో పెట్టాలని డిమాండ్ వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.తెలంగాణ వచ్చాక మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజ్ ,జేఎన్టీయూ,వ్యవసాయ కళాశాలతో పాటు ఆక్వా హబ్ ను కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.కొత్త మెడికల్ కాలేజీలో చేరిన విద్యార్థులు 6 నెలలు ఏమైనా చిన్న ఇబ్బందులు ఉన్న సహకరించాలని తెలిపారు.విద్యార్థులకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడే రక్షకులు అని,
వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చే ప్రజలు దేవుళ్ళతోపాటు వైద్యులను కూడా మొక్కుతారన్నారు. అంతటి పవిత్రమైన వృత్తి వైద్యులదన్నారు.
వైద్య వృత్తిలో రాణిస్తూ తెలంగాణకు దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి,సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,రాష్ట్ర పవర్ లూం,టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య,
మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పి అఖిల్ మహాజన్,అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్,గౌతమ్ రెడ్డి,మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News