ఓజోన్ అంటే సమస్త ప్రపంచాన్ని రక్షించే ఒక కవచం. భగభగమండే సూర్యుడి నుంచి అతి నీలలోహిత కిరణాలు భూమిపైకి వస్తాయి. అయితే ఈ కిరణాలు భూమిపై నేరుగా పడితే, సకల జీవరాశులు డేంజర్ జోన్‌లో పడ్డట్లే అనుకోవాలి. తరుముకువచ్చే ఈ ప్రమాదాన్ని అడ్డుకుంటోంది ఓజోన్ పొర. అంతిమంగా సూర్యుడి నుంచి భూగోళాన్ని ఓజోన్ పొర కాపాడుతోంది. భూ ఉపరితలంపై స్ట్రాటోస్పియర్ ఆవరణంలో ఓజోన్ పొర ఆవరించి ఉంటుంది. భూమి నుంచి 25 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో ఈ పొర ఉంటుంది. కొంతకాలంగా ఓజోన్ పొర క్రమేపీ పలచబడుతోంది. దీనికి మానవ విధ్వంసమే ప్రధాన కారణమని సైంటిస్టులు చెబుతు న్నారు. 1975లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర దెబ్బతిన్నట్లు తొలిసారిగా సైంటిస్టులు గుర్తించారు. ఇలా దెబ్బతిన్న పొర, రోజులు గడిచేకొద్దీ మరింత పలచన అయింది. 1987 నాటికి పరిస్థితి మారింది. ఓజోన్ పొర తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే చాలాభాగం ఓజోన్ పొర దెబ్బతిందన్నారు సైంటిస్టులు. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్ పొరకు రం ధ్రం పడేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భూమి మీద వేడి విపరీతంగా పెరుగుతోంది. మానవాళి మనుగడను ఇ బ్బందుల్లో పడేస్తోంది. తరుముకొచ్చే ప్రమాదాన్ని గమనిం చిన ప్రపంచ దేశాలన్నీ వెంటనే అప్రమత్తమ య్యాయి. ఓజోన్ పొరను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఫలితంగా ఇదే అంశంపై 1985లో వియన్నా కన్వెన్షన్ జరిగింది. దీని ప్రకారం ఓజోన్ పొరను దెబ్బతీసే ఎలాం టి పదార్థాలను గాలిలోకి వదలకూడదని ఈ కన్వెన్షన్‌లో ప్రపంచదేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో గ్లోబల్ వార్మింగ్ కు దారితీసే గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయం తీసుకున్నాయి
ఓజోన్ పొర దెబ్బతినడం మానవ తప్పిదమే !
ఓజోన్ పొర దెబ్బతినడమనేది ప్రకృతి విపత్తు కాదు. ఇది నూటికి నూరు శాతం మానవ తప్పిదమే అంటున్నారు సైంటిస్టులు. ఓజోన్ విధ్వంసంలో క్లోరోఫ్లోరో కార్బన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటితోపాటు బ్రోమిన్ కూడా ప్రమాదకారిగా మారుతుంది. బ్రోమిన్‌ను ఫైర్ సేఫ్టీ పరికరాల్లో ఉపయోగిస్తున్నారు. పంటలపై చల్లే స్ప్రేలు, రిఫ్రిజిరేటర్లు, ప్లాస్టిక్, ఫోమ్, దోమల నాశనానికి వాడే కాయిల్స్…వీటన్నిటి ఫలితంగా అంతిమంగా ఓజోన్ పొరకు చిల్లులు పడుతున్నాయి. అయితే గతంలో ఓజోన్ పొరకు పడిన రంధ్రం ఇటీవల పూడుకుపోయింది. భూగో ళానికి పెనుముప్పు తప్పింది. ఈ క్రెడిట్ ఎవరిదో కాదు. నూటికి నూరుశాతం కరోనా మహమ్మారిదే. కరోనా సమయంలో ప్రపంచదేశాలన్నీ లాక్‌డౌన్ విధించిన సం గతి తెలిసిందే. దీంతో దాదాపు ఏడాదికిపైగా ప్రపంచంలో అన్నిరకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ పారిశ్రామిక సంస్థలు బంద్ అయ్యాయి. ఎక్కడా కాలుష్యం అనే మాటే వినపడలేదు. దీంతో, ఓజోన్ పొరకు పడిన రంధ్రం చాలా త్వరగా పూడుకుపోయింది. అయితే కరోనాతో పాటు …ఉత్తర ధ్రువంలో ఏర్పడిన పోలార్ వర్టెక్స్ బలహీనపడటం కూడా ఓజోన్ పొర త్వరగా పూడు కుపోవడానికి మరో కారణం అంటున్నారు సైంటిస్టులు. ఓజోన్ లేయర్ అంశంపై చర్చించడానికి 24 దేశాల ప్రతినిధులు మాంట్రియల్ నగరంలో 1994 సెప్టెంబర్ 16వ తేదీన సమావేశమయ్యారు. ఈ చర్చల సందర్భంగా జరిగిన ఒప్పందంపై ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ తేదీకి గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 16న ‘ఓజోన్ లేయర్ డే’ని నిర్వహించాలని తీర్మానించారు. అప్పటి నుంచీ సెప్టెంబర్ 16న అన్ని దేశాల్లో వరల్డ్ ఓజోన్ డే ను జరుపుకుంటున్నారు. ఓజోన్ పొరకు సంబంధించిన అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భూమి మీద కాలుష్యం కారణంగా దెబ్బతింటున్న ఓజోన్ పొరను పరిరక్షించేందుకు మాంట్రియల్ ఒప్పందాన్ని 24 దేశాల ప్రతినిధులు రూపొందించారు.
క్లోరోఫ్లోరో కార్బన్‌ల వాడకాన్ని నిలిపివేసిన భారత్
ఓజోన్ పొర విషయంలో భారత్ గట్టి నిర్ణయాలు తీసుకుంది. ఓజోన్ లేయర్‌ను కాపాడుకోవడానికి 1993 నుంచి జాగ్రత్తలు తీసుకునే పనిలో పడింది.2008లోనే క్లోరోఫ్లోరో కార్బన్‌ల వాడకాన్ని నిలిపివేసింది. మాంట్రియల్ ఒప్పందం మేరకు గడువు కంటే ముందుగానే అనేక నియంత్రణలు పాటించింది భారతదేశమే. సీటీసీ ఉత్ప త్తులు వినియోగాన్ని 85 శాతం మేరకు కుదించడానికి సంబంధించిన లక్ష్యం నెరవేర్చిన దేశం కూడా ఇండి యానే. భారతదేశంలో సీఎఫ్‌సీకి ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) అనేక పరిశోధనలు చేపట్టింది.ఓజోన్ పొర విషయంలో పరిస్థితి గతం కంటే ఇప్పుడు కొంత మెరుగ్గానే ఉందంటున్నారు సైంటిస్టులు. ఏమైనా ఓజోన్ పొర విషయంలో ప్రపంచ దేశాలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితే ఉంది. ముప్పు పూర్తిగా తొలగిపోలేదంటున్నారు సైంటిస్టులు. ఓజోన్ పొరకు చిల్లులు పడడంతో మానవాళి వ్యాధుల బారిన పడుతోంది. అతి నీలలోహిత కిరణాలు భూమిని నేరుగా తాకడంతో నేత్ర వ్యాధులు, చర్మ క్యాన్సర్ తో పాటు జన్యుపరమైన వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కంటి వ్యాధులు పెరుగుతున్నాయి. స్ట్రోటోస్ఫియర్ వాతావరణంలో ఉష్టోగ్రతలు పెరగడమే దీనికి కారణం. ఓజోన్ పొర రంధ్రం చాలావరకు పూడుకుపోయింది కాబట్టి సరిపోయింది కానీ, లేనట్లయితే కంటికి సంబంధించిన వ్యాధులు తీవ్రమయ్యేవని హెచ్చరిస్తున్నారు. ఏసీలు, కాస్మోటిక్స్, స్ప్రేల నుంచి ప్లాస్టిక్ వరకు ప్రతి వస్తువును పరిమితికి మించి వినియోగిస్తున్నాం. ఇదే ఓజోన్ పొరకు ప్రమాదం వాటిల్లే పరిస్థితి తీసుకువస్తోంది. తొలుత ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి అంటు న్నారు సైంటిస్టులు. స్ప్రేలు కూడా అవసరం మేరకు వాడాలి. ఏసీల వాడకం బాగా తగ్గించాలి. పాలిథిన్ వినియో గాన్ని కూడా తగ్గించాలి. మనషి జీవన విధానంలో మార్పు లు రావాలి. అంతిమంగా ఓజోన్ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పుడే భూగోళానికి రక్షా కవచం లాంటి ఓజోన్ పొరను మనం కాపాడుకోగలుగుతాం.
ఎస్, అబ్దుల్ ఖాలిక్
సీనియర్ జర్నలిస్ట్ -63001 74320
(నేడు వరల్డ్ ఓజోన్ లేయర్ డే )
Ozone in danger zone: డేంజర్ జోన్‌లో ఓజోన్ పొర
ఓజోన్ లేయర్ డే ఈరోజే