Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: బాబుకు బెయిల్ రావాలని 101 కొబ్బరికాయలు కొట్టిన నేత

Emmiganuru: బాబుకు బెయిల్ రావాలని 101 కొబ్బరికాయలు కొట్టిన నేత

చంద్రబాబు కోసం పూజలు చేస్తున్న క్షేత్రస్థాయి నేతలు

నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ, ఆయన త్వరగా బయటికి రావాలని అకంక్షిస్తూ ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కొండయ్య చౌదరి, సుందర్ రాజు, మాజీ ఎంపిపీ వాల్మీకి శంకరయ్య, రామదాసు గౌడ్, దయాసాగర్, రామకృష్ణ నాయుడు తామంతా చంద్రబాబుతోనే ఉన్నామన్నారు. సోమప్ప సర్కిల్ లో 4 వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నందవరం టిడిపి నాయకులు దేశాయ్ నెట్ వర్క్ గురురాజ రావు దేశాయ్ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు దేవేంద్ర, కటారి రాజేంద్ర, నేసే మల్లికార్జున, దామ నరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News