Saturday, October 5, 2024
HomeతెలంగాణRamagundam: సీనియర్ సిటిజన్ ల భద్రత, సహాయం కోసం వాలంటీర్ కమిటీల ఏర్పాటు

Ramagundam: సీనియర్ సిటిజన్ ల భద్రత, సహాయం కోసం వాలంటీర్ కమిటీల ఏర్పాటు

రామగుండము పోలీస్ కమీషనరేట్ లో 40 వాలంటీర్ కమిటీలు

కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా రామగుండము పోలీస్ కమిషనరేట్ లోని సీనియర్ సిటిజన్ల ప్రాణ, ఆస్తుల రక్షణలో పోలీసుల బాధ్యతలో భాగంగా వృద్ధ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 నియమాలు, 2011 ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, సీనియర్ సిటిజన్ల సంరక్షణ లేకపోవడం, ప్రాథమికంగా 60 ఏళ్లు పైబడిన వృద్దులకు, ఇంట్లో ఒంటరిగా ఉన్నవారికి, పిల్లలు లేని వారికి లేదా వారి పిల్లలు ఇతర నగరాల్లో లేదా విదేశాలలో స్థిరపడిన వారిపై శ్రద్ధ అవసరం. ఇలాంటి పరిస్థితుల లో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సరైన సమయంలో చికిత్స అందించక పోవడం వలన కొన్ని సమయాలలో వారు శారీరక మానసిక వేధింపులకు కూడా గురి అవుతున్నారు. అలాంటి వృద్ధుల భద్రత మరియు ఆస్తుల రక్షణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక వాలంటీర్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అని రామగుండము పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్.,డిఐజి., తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల్ జోన్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో సీనియర్ సిటిజన్లకు అర్థవంతమైన సమర్థవంతమైన రక్షణను అందించడానికి వారికి భద్రత కల్పించడానికి వాలంటీర్ల టీమ్, పోలీసులు సీనియర్ సిటిజన్‌లలో ఉన్న అభద్రత భావాన్ని తొలగించడం ద్వారా వారిలో విశ్వాసాన్ని నింపుతారని వైద్య సహాయంతో సహా అత్యవసర సేవలను పొందేలా సీనియర్ సిటిజన్‌లకు అండగా ఉంటారు అని కమీషనర్ తెలిపారు. ప్రతి పోలీసు స్టేషన్‌కు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మంది వాలంటీర్ల కమిటీ లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కమిటీలో సీనియర్ సిటిజన్ సభ్యుడు, గుర్తింపు పొందిన ఎన్.జీ.ఓ సభ్యుడు, ప్రభుత్వ కమిటీలలో ఏదైనా ఒకదానిలో సభ్యులుగా ఉన్న మహిళా సభ్యురాలు ఉదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, యూనిఫాం సర్వీస్‌లో పనిచేసి పదవీ విరమణ చేసిన వ్యక్తితో కలిపి టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. పోలీసు అధికారులు తరచూ సీనియర్ సిటీజన్స్ జీవిత రక్షణ కోసం వాలంటీర్‌తో కలిసి సీనియర్ సిటిజన్‌ల నివాసానికి వెళ్లి వారిని కలవడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్ల ఫిర్యాదులు సమస్యలను స్థానిక పోలీసులు వెంటనే పరిశీలించి పరిష్కారించడం జరుగుతుంది. ఈ వాలంటీర్లు సీనియర్ సిటిజన్స్ ను నిరంతరం పర్యవేక్షిస్తారు. సీనియర్ సిటిజన్ లు స్వతంత్రంగా జీవించేందుకు సమాజానికి సేవ చేయడానికి వారి అపారమైన అనుభవాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కూడా ఈ కమిటీల ముఖ్య లక్ష్యం అని సీపీ అన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో సీనియర్ సిటిజన్‌లకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలతో కూడిన ప్రత్యేక రిజిస్టర్‌ను నిర్వహించడం జరుగుతుంది, వారి పిల్లలు, బంధువులు లేదా చట్టపరమైన వారసుల పేర్లతో పాటు వారిని తరుచుగా కలిసే వారి వివరాలు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో అటువంటి నేరాల యొక్క నెలవారీ నివేదికను అధికారులు ప్రతినెలా 10వ తేదీలోపు సీపీ పంపడం జరుగుతుంది. పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసే ప్రతిపై అధికారి రిజిస్టర్లను చెక్ చేస్తామన్నారు. గత నెలలో సీనియర్ సిటిజన్‌లపై జరిగిన నేరాల స్థితి పురోగతితో సహా నమోదైన నేరాల విచారణ వాటిపై తీసుకున్న నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు సీనియర్ సిటిజనుల సంరక్షణలో భాగస్వాములు కావాలని సీనియర్ సిటిజెన్లపై జరుగుతున్న నేరాలు అఘాత్యాలు, కుటుంబ సభ్యులు బాగోవులు చూడకుండా ఇబ్బంది పెట్టే విషయాలు పోలీస్ అధికారులకి సమాచారం అందించాలని, ఈ సందర్భంగా సీపీ ప్రజలను కోరారు. గణేష్ నవరాత్రుల పండుగ తరువాత సీనియర్ సిటిజెన్ ల సంరక్షణకు సంబంధించి సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులను మానసికంగా, శారీరకంగా వేధించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News