రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశంలో, ప్రపంచంలో కూడా ఎక్కడా లేవనీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పేర్కొన్నారు.
బిచ్కుంద మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే హన్మంత్ షిండే అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు.ప్రతి ఒక్కరికి 6కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నామని,కల్యాణలక్ష్మి పథకం, బస్తీ దవాఖాన, కేసీఆర్ కిట్, గురుకుల పాఠశాలలు ఇలా చెబుతా ఉంటే చాలా ఉన్నాయన్నారు. గర్భిణులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు న్యూట్రిషన్ కిట్‌ను అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో రూ.2వేల పెన్షన్ ఇస్తున్నారని,కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని అన్నారు.
డప్పు కొట్టి అశ్చర్యపరిచి,
బిచ్కుంద మండలంలోని పత్లాపూర్ గ్రామం లో, గ్రామపంచాయతీ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముందు ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఉత్సాహం తో డప్పు కొట్టి అందరిని అశ్చర్య పరిచారు.