రక్తదానం మరొకరి జీవితానికి వెలుగు.. రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి.. అంటూ “షాద్ నగర్ బ్లడ్ సెంటర్ “ను పట్టణ కేంద్రంలో ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ…. దూర ప్రాంతాలకు వెళ్లే శ్రమ తగ్గించేందుకు మన పట్టణ కేంద్రంలో షాద్ నగర్ బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభమైందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని కోరారు. రక్తదానం అవసరమైన వారికి సకాలంలో అందించి ప్రాణదాతలుగా నిలిచేలా ఉండాలని సూచించారు.
బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు బి రామస్వామి అద్యక్షుడు మాట్లాడుతూ …మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ప్రమాదకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారు.మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరం. సకాలంలో రక్తం అందక చనిపోతున్నవారు ఎందరో.. అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుంది. దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమవుతుంది. సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపడవచ్చు.
బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో ఒక్కసారి రక్తదానం చేస్తే సంవత్సరం లోపు బంధువులకైన కుటుంబ సభ్యులకైన ఇలాంటి గ్రూపు బ్లడ్ అయినా ఉచితంగా ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. దూర ప్రాంతాలకు తరలి వెళ్లకుండా సకాలంలో వారిని రక్షించేందుకు బ్లడ్ బ్యాంకు ను ప్రారంభించామని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేతలు అందే బాబయ్య స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Anjayya Yadav: ‘షాద్ నగర్ బ్లడ్ సెంటర్’ ప్రారంభం
రక్తదానం చేసిన వారి కుటుంబాలకు ఏడాదిపాటు రక్తం