Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: మేము సైతం-బాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైల్ కు 116 ఉత్తరాలు

Nandavaram: మేము సైతం-బాబు కోసం రాజమండ్రి సెంట్రల్ జైల్ కు 116 ఉత్తరాలు

చంద్రబాబు విడుదల కోసం బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు

వినాయక చవితి సందర్భంగా నందవరం తెలుగుదేశం పార్టీ నాయకులు గురురాజ్ దేశాయ్ నందవరం గ్రామంలో వెలసిన వినాయక విగ్రహాలను సందర్శించి వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని బొజ్జ గణపయ్యను కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా మేము సైతం – బాబు కోసం అని నినదిస్తూ చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం లాగా బయటికి రావాలని కోరుకుంటు నారా చంద్రబాబు నాయుడు కి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరిండెంట్ కి 116 ఉత్తరాలను నందవరం మండల తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గురురాజ దేశాయ్ పంపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు డాక్టర్ బి వి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఆయన నిరపరాధిగా బయటకు వచ్చేవరకు నిరవధిక సమ్మెలు నిర్వహిస్తూ రోజుకో రకంగా ఇలానే వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తామని వారన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి రామన్న గౌడు , దేశాయ్ యూత్ అద్యక్షుడు సాదిక్ , కే. శివ , డానియల్, గ్రామ పెద్దలు జయన్న, నాగేంద్రప్ప, నర్సప్ప తదితర దేశాయ్ యూత్ సభ్యులు సందీప్, కాసిం, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News