Sunday, October 6, 2024
HomeతెలంగాణMLA Korukanti Chander: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజా సంరక్షక పాలన

MLA Korukanti Chander: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రజా సంరక్షక పాలన

బిజెపి, కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రజా సంరక్షక పాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తిలక్ నగర్ లోని విశ్వం ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన రాజన్నల సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకాలు ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతుందడటంతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నామని, ప్రజల ఆకాంక్షల నెరవేర్చడమే నా బాధ్యత అని అన్నారు. పదవుల కోసం రాజకీయాలకు రాలేదన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజా సేవకే నా జీవితం అంకితం చేస్తానని అన్నారు. గతంలో కొంతమంది ముఖ్యంగా ఉన్నటువంటి రాజన్నలను తమ స్వలాభం కోసం విడగొట్టి, రాజకీయ స్వార్థ ప్రయోజనం పొందారని అన్నారు. కానీ ఎమ్మెల్యే చందర్ రాజన్నల సంక్షేమం కోసం నా వంతు బాధ్యతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలిసికట్టుగా ముందుకు సాగితేనే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని అన్నారు. రాజన్నల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం రాబోయే కాలంలో సొసైటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. సీఎం కేసీఆర్, పురపాలక ఐటి శాఖ మాత్యులు కేటీఆర్ సహకారంతో రామగుండంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ ఊరికి అక్కడికి రానోల్లు కావాల్సుకొని అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కొంతమంది ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ఓర్వలేక కొంతమంది చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతుందని అన్నారు. 60 ఏళ్ల కాలంలో ఏమి చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఏదో అభివృద్ధి చేసి చూపిస్తామని అనడం హాస్యాస్పదమన్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలో రెండు కూడా మోసపూరిత పార్టీలు అన్నారు. రాబోయే ఎన్నికల్లో విపక్ష పార్టీలకు ఓటు వేస్తే మనకు మనమే అన్యాయం చేసుకున్న వాళ్ళము అవుతామని అన్నారు. రైతు సంక్షేమం కోసం రైతుబంధు రైతు బీమా, దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు, బీసీ సంక్షేమం కోసం బీసీ బందు, నిరుపేద యువతుల పెళ్లిళ్లకు చేయూతనివ్వడం కోసం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలను సీఎం కెసిఆర్ పగడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. కేవలం 9 ఏళ్ల కాలంలోనే వందేళ్ల అభివృద్ధిని సాధించిన తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. ఒకప్పుడు ఎండిన గోదారితో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు నిండుకుండల కావడం సీఎం కెసిఆర్ పాలనకు నిదర్శనం అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని నిరుపేదల ఆరోగ్య సంరక్షణ కోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి, వైద్య పరీక్షలు మందులను పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని చందర్ అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో గొప్ప పాలన చేస్తున్నటువంటి సీఎం కేసీఆర్ కు అండగా నిలిచి, రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కాగా రామగుండం రాజన్న సంఘం బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ఎంతో సంతోషమని చందర్ అన్నారు. బిఆర్ఎస్ నాయకులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నగర మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు కౌశిక హరి ప్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్, నారాయణదాసు మారుతి, తోడేటి శంకర్ గౌడ్, చెలుకలపల్లి శ్రీనివాస్, జెవి రాజు, సింహాచలం రత్నాకర్, దొమ్మెటి వాసు, చెలుకలపల్లి సతీష్, అల్లి గణేష్, దండు రవి, రాజన్నల సంఘం బాధ్యులు మెరుగు గట్టయ్య, మొగిలి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News