మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను(ఉత్తర్వులు) పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి.ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు.ఈ విషయంలో గత 50 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి ప్రస్తుతం సీఎం కేసీఆర్ హయాంలో జరుగుతుందని అన్నారు.సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి,డబల్ బెడ్ రూమ్,గృహలక్ష్మి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని మంత్రి అన్నారు. మంచి ఆలోచన దృక్పథంతో చేపట్టే కార్యక్రమాలని పూర్తిస్థాయిలో విజయవంతమవుతాయని అన్నారు.గృహలక్ష్మి పథకం కింద ఖాళీ స్థలం,ప్లాట్ ఉన్నవారికి మూడు లక్షలు అందజేయడం జరుగుతుందని అన్నారు.మేడ్చల్ నియోజకవర్గం లో గృహలక్ష్మి పథకం కింద మూడు వేల ఇళ్లకు మంజూరు అయ్యాయని,మొదటి విడతగా 800 మంది లబ్ధిదారులకు ఉత్తర్వులు అందజేశామని అన్నారు.రెండో విడత మూడో విడతల్లో సైతం అర్హులైన వారందరికీ సోమవారం,బుధవారం లలో ఉత్తర్వులు పంపిణీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం అయ్యేలా ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారానీ అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి,అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి,శ్రీనివాస మూర్తి,జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య,దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్,నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి,కౌన్సిలర్లు,ఎంపీపీలు,జడ్పిటిసిలు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు,తదితరులు పాల్గొన్నారు.