విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకెల్తున్నారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నలభై ఒకటవ డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టి ఆరు గ్యారంటీలను గడప గడపకు వెళ్లి వివరించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీలపై ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని ముఖ్యంగా మహిళలు చాలా ఆనందంతో స్వాగతిస్తున్నారన్నారు. యువకులకు రైతులకు అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్న ఆరు గ్యారంటీ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బాధ్యులు బాకారపు శ్రీధర్, జిలకర రమేష్, బింది శెట్టి రాజు, ఫిరోజ్ ఖాన్, ఎండి అహ్మద్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పొరండ్ల రమేష్, కుర్ర పోచయ్య, షేక్ శేహెన్ష, మెతుకు కాంతయ్య, చంద్రయ్య గౌడ్, మహమ్మద్ భారీ, షబానా మహమ్మద్, ఊరడి లత, ముల్కల కవిత, అన్నే జ్యోతి రెడ్డి, అష్రఫ్ ఖురేషి, స్వరూప, బాలబద్రి శంకర్, మహాలక్ష్మి, ఇమామ్, హనీఫ్, ముల్కల యోన, సోహెల్, శ్రీకర్, సాయి రామ్, రవీందర్ రావు, ఉప్పరి అజయ్, ఖలీల్, హేమంత్, కురిమిల్ల రమ, కమల, అనూష, అల్లావుద్దీన్, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
Komatireddy Narendar Reddy: గడప గడపకు కాంగ్రెస్ ద్వారా 6 గ్యారంటీలు
ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్న నేత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES