Thursday, September 19, 2024
Homeతెలంగాణపాల‌కుర్తి మెగా జాబ్ మేళాకు భారీ స్పంద‌న‌

పాల‌కుర్తి మెగా జాబ్ మేళాకు భారీ స్పంద‌న‌

జ‌య‌వంతంగా జాబ్ మేళా... విశేషంగా పాల్గొన్న ఉద్యోగార్థులు

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో డి.ఆర్.డి.ఎ, జనగామ మ‌రియు ఎర్ర‌బెల్లి చారిటబుల్ ట్ర‌స్టుల సంయుక్త ఆధ్వ‌ర్యంలో పాల‌కుర్తిలోని ఓ ఫంక్ష‌న్ హాలులో నిర్వ‌హించిన మెగా జాబ్ మేళా విజ‌య‌వంతంగా ముగిసింది. ఈ జాబ్ మేళాలో మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీలు స‌హా మొత్తం 80 వివిధ కంపెనీలు పాల్గొన‌గా, 14వేల 205 మందికి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించడానికి అవ‌కాశాలు ఉండ‌గా, ఆయా ఉద్యోగాల కోసం వేలాదిగా ఉద్యోగార్థులు త‌ర‌లివ‌చ్చారు. కొడ‌కండ్ల‌, పాల‌కుర్తి, దేవరుప్పుల, తొర్రూరు, రాయపర్తి, పెద్దవంగర మండ‌లాల ఉద్యోగార్థుల‌కు ఈ మేళా నిర్వ‌హించ‌గా, ఆయా మండ‌లాల నుంచేగాక‌, జిల్లాలోని ప‌లు ప్రాంతాల నుంచి వేలాదిగా యువ‌తీ యువ‌కులు త‌ర‌లి వ‌చ్చి, ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఆయా కంపెనీల ప్ర‌తినిధులు ఓపిక‌గా ఇంట‌ర్వ్యూలు చేశారు. వారి అర్హ‌త‌లు, ఇంట‌ర్వ్యూల‌ను ఎదుర్కొన్న తీరుతెన్నులు, అవ‌కాశాల‌ను బ‌ట్టి అనేక మందికి ఈ మేళా ద్వారా ఉద్యోగాలు క‌ల్పించ‌నున్నారు. ఈ సంద‌ర్భగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఒక్కో కంపెనీ కౌంట‌ర్ వ‌ద్ద‌కు వెళ్ళి, ఉద్యోగాల ఎంపిక‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. ఉద్యోగార్థుల‌తో ముచ్చ‌టించి, వారి అర్హ‌త‌లు, అవ‌కాశాల‌పై చ‌ర్చించారు. ఉద్యోగార్థుల‌కు, వారి వెంట వ‌చ్చిన స‌హాయ‌కుల‌కు భోజ‌నాలు పెట్టించారు. అలాగే ఆయా కంపెనీల‌కు కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News