Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet meeting: కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు

AP Cabinet meeting: కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు

కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ…… 1.
– విద్యాశాఖలో అంతర్జాతీయ ప్రమాణాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం మరోముందడుగు. ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌(ఐబీ)తో విద్యాశాఖ ఏంఓయూకు కేబినెట్‌ ఆమోదం. ఇదో గొప్ప చారిత్రక అడుగు అన్న ముఖ్యమంత్రి.

- Advertisement -

ఐబీ సిలబస్‌ దిశగా అడుగులేస్తున్నాం.
అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి సిలబస్‌ ఉంటుంది.
అలాంటి సిలబస్‌ను మన పిల్లలకు అందుబాటులో ఉంచుతున్నాం.
ఏ యూనివర్శిటీకి వెళ్లినా.. మంచి అవకాశాలు వస్తాయి, ప్రశ్నలు వేసే విధానం, వాటికి సమాధానాలు నేర్చుకునే విధానం నిజజీవితాలకు దగ్గరగా ఉంటుంది
– రియల్‌ లైఫ్‌లో జ్ఞానసమపార్జన ఎలా ఉంటుందో, ఐబీ సిలబస్‌ విధానం అలాగే ఉంటుంది.
– మొదటి తరగతితో నెమ్మదిగా ప్రారంభమై మిగిలిన తరగతులకు విస్తరించుకుంటూ వెళ్తారు.
– ఐబీ సిలబస్‌పై ఇవాళ ఎంఓయూ.
– ఎంఓయూ పట్ల కేబినెట్‌ సభ్యుల హర్షధ్వానాలు.
– ఇప్పటికే మూడో తరగతి నుంచి టోఫెల్‌ పరీక్ష ప్రారంభం అయ్యింది.
– వారానికి ఆరు రోజులపాటు ప్రతిరోజూ ఒక గంట టోఫెల్‌పై శిక్షణ.
– దీనివల్ల వారికి ఇంగ్లిషులో పరిజ్ఞానం బాగా పెరుగుతుంది.
– 8, 9 తరగతులు వచ్చేసరికి మంచి నైపుణ్యాలను అలవర్చుకుంటారన్న ముఖ్యమంత్రి. 2.
ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ బిల్లు –2023 కు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి.
జూన్‌ 2వ తేదీ, 2014 కంటే ముందు నియమితులై… ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 11,633 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. 3.
ఆంధ్రప్రదేశ్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం(ఏపీజీపీఎస్‌) అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ గ్యారంటీడ్‌ పెన్షన్‌ సిస్టం బిల్లు– 2023ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం.
ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు.
బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.
అసెంబ్లీలోకి బిల్లు. ఇదే సమయంలో అధికారులకు సీఎం ఆదేశాలు.
ఉద్యోగి రిటైర్‌ అయిన సమయానికి ఇంటి స్థలం లేనివారికి కచ్చితంగా ఇంటిస్థలం ఉండాలని సీఎం ఆదేశం.

ఇది ప్రభుత్వ బాధ్యతగా ఉండాలి.
రిటైర్‌ అయిన తర్వాత కూడా ఉద్యోగులు, వారి పిల్లలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందరూ కవర్‌ అయ్యేలా చూడాలి.
రిటైర్‌ అయిన పిల్లల చదువులు కూడా ఫీజు రియింబర్స్‌ మెంట్‌ కింద ప్రయోజనాలు అందేలా చూడాలి.
ఈమేరకు చర్యలు తీసుకోవాలన్న సీఎం. 4.
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న… ఆంధ్రప్రదేశ్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్స్‌ టు పబ్లిక్‌ సర్వీసెస్‌ అండ్‌ రేషనైలేజేషన్‌ ఆఫ్‌ స్టాఫ్‌ పేట్రన్‌ అండ్‌ పే స్ట్రక్చర్‌) యాక్ట్‌– 1994 సవరణలకు కేబినెట్‌ ఆమోదం. ఈ సవరణ ద్వారా… 2017 డెఫ్‌ ఒలింపిక్స్‌ టెన్నిస్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్య పతకవిజేత, ఇండియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ టీం కెప్టెన్‌ కుమారి షేక్‌ జఫ్రీన్‌కు గ్రూప్‌ వన్‌ సర్వీసెస్‌లో కోఆపరేటివ్‌ సొసైటీస్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ హోదాలో నియామకానికి కేబినెట్‌ ఆమోదం. 5.
ఏపీ వైద్య విధాన పరిషత్‌ను వైద్య ఆరోగ్య రంగంలోకి విలీనం.
ఆర్డినెన్స్‌ స్ధానంలో దీనికి సంబంధించిన బిల్లుకు ఆమోదం.
అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు.
ఏపీ వైద్య విధాన పరిషత్‌లో ఉద్యోగులకు మరింత మేలు. 6.
కేన్సర్‌ రోగులకు మరింత మెరుగైన చికిత్స అందించే చర్యల్లో భాగంగా విశాఖ కింగ్‌జార్జ్‌ ఆసుపత్రి, గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి, కడప, ప్రభుత్వ ఆసుపత్రిలో కేన్సర్‌ సెంటర్‌లో పాటు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని పీఎంయూలో 353 పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. జీరో వెకెన్సీ పాలసీని వైద్య ఆరోగ్య శాఖలో సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం.
ఎక్కడా కూడా సిబ్బంది లేకుండా ఖాళీలు ఉన్నాయన్న మాట వినపడకూడదని అధికారులు సీఎం ఆదేశం.

7. ఒంగోలు, ఏలూరు, విజయవాడలలో ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలలో ప్రమోషన్‌ విధానం లేదా అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా… 168 పోస్టులు భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. వైద్య ఆరోగ్యరంగాన్ని మరింత » బలోపేతం చేసే చర్యల్లో భాగంగా… 11 ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రులు, వైద్య కళాశాలలో 99 పోస్టుల భర్తీ చేయాలన్న వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. 8.
ఆరోగ్య సురక్షకు కేబినెట్‌ ఆమోదం.
ఇప్పటికే సెప్టెంబరు 15 నుంచి ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ప్రారంభం. ఈ సందర్భంగా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు సీఎం ఆదేశాలు.
జగనన్న సురక్ష మాదిరిగా సమర్థవంతంగా అమలు జరగాలి.
వాలంటీర్లు, ప్రజాప్రతినిధులు వెళ్లి ఆరోగ్య శ్రీ మీద, ఆరోగ్య సురక్ష మీద అవగాహన కల్పిస్తారు.
తర్వాత ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, వాలంటీర్లు, ఎంఎల్‌హెచ్‌పీలు మళ్లీ రెండో విడత ప్రతి ఇంటికీ వెళ్తారు.
గ్రామంలో ఎవ్వరికి ఎలాంటి పరీక్షలు అవసరమైనా ఉచితంగా చేయిస్తారు
ఉచితంగా మందులు ఇస్తారు.
ఫలానా తేదీల్లో మెడిక్‌ క్యాంపులు నిర్వహిస్తారన్న విషయాన్నికూడా వారికి తెలియజేస్తారు.
ఆరోగ్యశ్రీ కింద ఎలా సేవలు అందిస్తారన్న దానిపై అవగాహన కల్పిస్తారు.
మ్యాపింగ్‌ చేసిన తర్వాత పరీక్షలు, మందులు ఇస్తారు.
తర్వాత అవసరమైన చికిత్సలు అందించేలా వారికి చేయూతనిస్తారు.
తీవ్రవ్యాధులతో సతమతం అయ్యేవారికి పూర్తిచికిత్స అందించేంతవరకూ కూడా వారికి చేదోడుగా నిలుస్తారు. క్యాంపుల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చురుగ్గా పొల్గొనాలి.
గతంలో ఆరోగ్య శ్రీ కింద సేవలు అందుకున్న వారికి కూడా సరిగ్గా సేవలు అందుతున్నాయా? లేదా? అని ఆరాతీస్తారు.
విలేజ్‌ క్లినిక్స్‌కు అందుబాటులో ఉన్న మందులు కాకుండా అదనంగా మందులు ఆరోగ్య సురక్షకు పంపిస్తున్నారు.
162 రకాల మందులు, 18 సర్జికల్స్‌ అందుబాటులో ఉంచుతున్నారు.
స్పెషలిస్ట్‌ వైద్యుల సూచనమేరకు ఇతర మందులు కూడా అందించేందుకు చర్యలు.
సెప్టెంబరు 30న జగనన్న సురక్ష క్యాంపులు.
45 రోజులపాటు జరగనున్న సురక్ష కార్యక్రమం.
నవంబర్‌ 15 నాటికి ముగిసేలా చర్యలు. 9.
ఆంధ్రప్రదేశ్‌ ప్రయివేటు యూనివర్సిటీస్‌(ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్టు –2016 కు సంబంధించిన సవరణలతో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా చట్ట సవరణ.
ఇందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌.
ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా ఈ చర్యలు.
ఈ మార్పుల వల్ల పిల్లలకు మంచి జరుగుతుంది:
ఇంతకుముందు ఉన్న ప్రైవేటు యూనివర్శిటీలు, కొత్తగా ఏర్పాటు చేసే ప్రైవేటు యూనివర్శిటీలకు ప్రపంచంలోని టాప్‌ 100 యూనివర్శిటీలతో టై అప్‌ ఉండేలా చట్ట సవరణ.
దీనివల్ల జాయింట్‌ సర్టిఫికేషన్‌.
ఇప్పుడు నడుస్తున్న ప్రైవేటు కాలేజీలు యూనివర్శిటీలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలోకి వస్తాయి.
దీనివల్ల మన పిల్లలకు మేలు జరుగుతుంది. 10.
కురుపాం ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 50 శాతం సీట్లు.. షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న ఎస్టీ విద్యార్ధులకే కేటాయించాలన్న ప్రతిపాదనలకుతీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 11.
అదోనిలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 34 టీచింగ్‌ పోస్టులు, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేయాలన్న తీర్మానానికి కేబినెట్‌ ఆమోదం. 12.
కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 13 స్పెషల్‌ కేడర్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులుతో పాటు 6 డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. 13.
సెరికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టు భర్తీకి కేబినెట్‌ ఆమోదం. 14.
ఆంధ్రప్రదేశ్‌ ఆధార్‌ చట్టంపై బిల్లుకు కేబినెట్‌ ఆమోదం.
వ్యక్తులు గుర్తింపు కోసం ఆధారం వినియోగంపై చట్టబద్థత 15.
పోలవరం నిర్వాసితులకోసం నిర్మిస్తున్న ఇళ్లు అంచనా ఖర్చు పెంపునకు కేబినెట్‌ ఆమోదం.
8424 ఇళ్ల నిర్మాణం అంచనా ఖర్చు మరో రూ.70 కోట్లు పెంచేందకు కేబినెట్‌ ఆమోదం.
2016–17 రేట్ల ప్రకారం గతంలో ఇళ్ల నిర్మాణం అంచనాలు తయారు. 16.
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వ హించిన పరీక్షల్లో ప్రిలిమనరీ, మెయిన్స్‌ రెండు విభాగాల్లో ఉత్తీర్ణులై సామాజిక, ఆర్ధిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతలుకు చెందిన అభ్యర్ధులకు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.


జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరుతో ఈ అవార్డులకు ఎంపికైన అభ్యర్ధులకు రూ.1 లక్ష, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సహకం ఇవ్వాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. ప్రిలిమినరీ క్వాలిఫై అయితే రూ.1లక్ష, వీరిలో మెయిన్స్‌ క్వాలిఫై అయిన వారికి అదనంగా మరో రూ.50వేలు.
మెయిన్స్‌ వరకూ వెళ్లిన వారికి మొత్తంగా రూ.లక్షన్నర
కష్టపడి చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్న ముఖ్యమంత్రి. 17.
ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ విభాగంలో డిప్యూటీ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్స్‌పెక్టర్‌ ‡(తిరుపతి), ఎలక్ట్రికల్‌ ఇన్స్‌పెక్టర్‌(రాజమండ్రి)లలో రెండు కొత్త పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. 18.
కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సూచనల మేరకు… ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ జోన్‌ మేనేజిమెంట్‌ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ)లో శాశ్వత విభాగం ఏర్పాటులో భాగంగా 10 కొత్త పోస్టుల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం. 19.
బాపట్ల, నాయుడుపేట, తణుకు మున్సిపాల్టీల పరిధిలో చదరపు మీటరకు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన ఇంటిగ్రేటెడ్‌ సాలిట్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో పాటు ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ ప్రాజెక్టులను డీబీఓటీ విధానంలో నిర్వహించేందుకు అవసరమైన భూమి కేటాయించేందుకు కేబినెట్‌ ఆమోదం. 20.
సాధారణ పరిపాలన విభాగంలో చీఫ్‌ ఎలక్టోరల్‌ కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. 21.
నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న రివల్యూషనరీ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఆర్డీఎఫ్‌), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(మావోయిస్టు) పై నిషేధాన్ని మరో ఏడాది పొడిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 22.
ఆంధ్ర ప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ యాక్టు –2017 కు సవరణలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.
యూనివర్శిటీల్లో రిక్రూట్‌ మెంట్‌ ఇకపై ఏపీపీఎస్సీ ద్వారానే బిల్లుకు కేబినెట్‌ ఆమోదం 23.
ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాంటీ సోషల్‌ అండ్‌ హజార్డస్‌ యాక్టివిటీస్‌ ట్రిబ్యునల్‌లో 5 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం. 24.
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా తొమ్మిది మంది జీవితౖఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 25.
అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ది ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూపు (ఏపీ ఎస్‌ఎస్‌జీ) బిల్లుకు ఆమోదం తెలిపిన కేబినెట్‌. 26.
కాకినాడ నుంచి బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ప్రాజెక్టును అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. ఏపీఐఐసీకి చెందిన 2వేల ఎకరాల్లో రూ.2190 కోట్లతో ఏర్పాటు కానున్న బల్క్‌డ్రగ్‌ ప్రాజెక్టు.
ప్రభుత్వ భూముల్లో నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల ప్రకారం స్థలం మార్పు.
ప్రయివేటు ల్యాండు సేకరణలో ఉన్న సమస్యల దృష్ట్యా కేంద్రం కొత్త మార్గదర్శకాలు.
నక్కపల్లిలో అందుబాటులో ప్రభుత్వ భూమి ఉండడంతో మార్పు. 27.
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో 40 ఆఫీసు సబార్డినేట్‌ పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయడానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 28.
ఏపీ హైకోర్టులో 28 డ్రైవర్‌ పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం. 29.
ఆంధ్ర ప్రదేశ్‌ మోటార్‌ వెహికల్‌ టాక్సియేషన్‌ యాక్ట్‌ 1963 సవరణలతో కూడిన డ్రాప్ట్‌ బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. 30.
ఆంధ్రప్రదేశ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ 2023 సవరణల బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. 31.
ఆంధ్రప్రదేశ్‌ ఛారిటబుల్‌ అండ్‌ హిందూ రిలిజియస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ అండ్‌ ఎండోమెంట్స్‌ యాక్టు –1987 సవరణలకు కేబినెట్‌ ఆమోదం. 32.
ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ ల్యాండ్స్‌ ( ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) యాక్ట్‌ 1977కు సవరణలకు కేబినెట్‌ ఆమోదం.
ఆర్డినెన్స్‌ స్థానంలో చట్టం తీసుకువస్తూ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం. 33.
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు 1 ఎకరా స్ధలాన్ని 33 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలన్న ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం. 34.
పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగులవరంలో 100.45 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 35.
గుంటూరుకు చెందిన విశ్వ మానవ సమైక్యతా సంసత్‌ విజ్ఞప్తి మేరకు …. ఎకరా రూ.1లక్ష చొప్పున 7.45 ఎకరాల స్ధలాన్ని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిమిపాలెంలో మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 36.
డెఫ్‌ ఒలింక్‌ 2017 టెన్నిస్‌ కాంస్య పతక విజేత కుమారి షేక్‌ జెఫ్రిన్‌కు 10 సెంట్ల ఇళ్ల స్ధలం కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం. 37.
ఆంధ్రప్రదేశ్‌ భూదాన్‌ అండ్‌ గ్రామదాన్‌ యాక్టు 1965 సవరణలతో కూడిన డ్రాప్ట్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం. 38.
చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కృష్ణ, శ్రీకాకుళం జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూమి కేటాయింపులకు కేబినెట్‌ ఆమోదం. 39.
బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూమి కేటాయింపులకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. 40.
ఆంధ్రప్రదేశ్‌ టూరిజం అథారిటీకి కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఉచితంగా 2.41 ఎకరాల భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 41.
మధురవాడలో యూనిటీ మాల్‌ నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం.
సంస్కృతి, కళలు పెంపొందించేలా టూరిజం ఎకానమీ పెంచడమే లక్ష్యంగా యూనిటీ మాల్‌.
ఇందులో భాగంగా నిర్మాణం కానున్న కన్వెన్షన్‌ సెంటర్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News