Friday, November 22, 2024
HomeతెలంగాణNiranjan Reddy: దివ్యాంగుల సేవలో మంత్రి

Niranjan Reddy: దివ్యాంగుల సేవలో మంత్రి

అన్ని వర్గాల సంక్షేమమే సర్కారు ధ్యేయం

తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రభుత్వ చేయూతందిస్తోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. దివ్యాంగులకు అందరూ ప్రేమను పంచాలని, వారికి తల్లితండ్రులు అన్ని విధాలా అండగా ఉండాలని.. అన్ని రకాలుగా దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం అందిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. 4,016 ఆసరా ఫించను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, చదువుకుంటున్న దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలతో ప్రోత్సాహిస్తూ, చదువుకుంటున్న విద్యార్థులకు 500 రూపాయల రవాణా భత్యం అందిస్తున్నామన్నారు. అవసరమైన విద్యార్థులకు వారానికి ఒకసారి ఫిజియోథెరపీ ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -

ప్రతి సబ్జెక్టుకు 20 మార్కులు వస్తే దివ్యాంగులు ఉత్తీర్ణత సాధించినట్టేనని, మానసిక దివ్యాంగులకు 10 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టే లెక్కన్నారు. ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించి దివ్యాంగులకు విద్యా బోధన చేయిస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞతలన్న ఆయన.. వారికి మనందరం అభినందనలు తెలపాలన్నారు. దివ్యాంగులైన పిల్లలకు కాలక్రమంలో మంచిగ అవుతుందన్నా ఆశాభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం నుండి వచ్చిన ఉపకరణాలు సద్వినియోగం చేసుకోవాలని, ఆడబిడ్డలు వారి కాళ్ల మీద వారు నిలబడాలని, కుట్టుమిషన్లతో జీవనోపాధి పొందాలన్నారు. గతం కన్నా కుట్లు, అల్లికల పనులకు ఆదరణ పెరిగిందని, అనేక మంది మహిళలు ఈ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా చేయూత అందిస్తున్నామని, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈమేరకు ప్రత్యేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.

వనపర్తి జిల్లాలోని దివ్యాంగులైన పిల్లలు 128 మందికి వీల్ చైర్స్ , హియరింగ్ ఎయిడ్స్ తదితర ఉచిత ఉపకరణాల పంపిణీ చేశారు. 270 మంది మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News