తెలంగాణ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి (టిఎంఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు జాం గారి రవి, ఢిల్లీ ధర్నాకు సంఘీ భావం తెలిపిన వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్ సి వర్గీకరణ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంఆర్పీఎస్ టీ ఎంఆర్పి ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు
ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా, నిరాహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు షాద్ నగర్ నియోజక వర్గం నుంచి జాం రవి, సింగపగా జంగయ్య ఆధ్వర్యంలో
టి ఎంఆర్పిఎస్ నేతలు చలో ఢిల్లీ కార్యక్రమం లో పాల్గొన్నారుఈ సందర్భంగా జాంగారి రవి మాట్లాడుతూ
గత 29 సంవత్సరాలు గడుస్తున్నా సామాజిక న్యాయమైన డిమాండ్ ఎస్ సి వర్గీకరణ సాధనలో కేంద్ర ప్రభుత్వాల జాప్యం.మాదిగ, మాదిగ ఉపకులాల అభివృద్ధి పట్ల వివక్షతతో కూడిన నిర్లక్ష్యం విడి SC వర్గీకరణ బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం చూడాలి. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో 2 సార్లు ఎస్.సి. వర్గీకరణ ఏకగ్రీవ తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం. జరిగింది ఎస్.సి. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించమని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్. దేశ ప్రధాని నరేంద్రమోది గారిని స్వయంగా కలిసి కోరడమైనది. బి.జె.పి. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్.సి. వర్గీకరణ చేస్తామని చెప్పి 9 సం॥లు గడుస్తున్నా ఇంతవరకు ఎస్.సి. వర్గీకరణ చేయలేదు. ఎస్.సి. వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుభూతితో కూడిన సరైన నిర్ణయం తీసుకొని భారతరత్న డా॥ బి.ఆర్. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని బలపరుస్తూ పెద్ద సామాజికవర్గమైన మాదిగ (చమార్), మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తక్షణమే ఎస్.సి. వర్గీకరణ బిల్లు ఉషామెహ్రా కమిషన్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్.సి.ల జనాభా దామాష ప్రకారం ఎ, బి, సి, డి, బిల్లు పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత పొందే విధంగా చూడాలి అని టి ఎం ఆర్ పి ఎస్ రాష్ట కమిటీ డిమాండ్ చేస్తుంది.చాలా ఏళ్ళ నుండి పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లు పార్లమెంటు లో పెడుతున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెడుతాలేరని ప్రశ్నించారు.
మహిళా బిల్లు బిజేపి మేనిఫెస్టోలో లేదని ఎస్సీ వర్గీకరణ మాత్రమే ఉందని అన్నారు. కనుక మహిళా బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పెట్టి మాదిగల పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని అన్నారు.రెండు నెలల క్రితమే వరంగల్ లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి దానిని ఇప్పుడు ఆచరణలో చూపెట్టుకోవాలని డిమాండ్ చేశారు.ముప్ఫై ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన బిజేపీ ప్రస్తుతం సంపూర్ణ మెజారిటీతో కేంద్రంలో అధికారంలో ఉండి కుడా ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎస్సి వర్గీకరణ చేయకుంటే తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల జనాభా కలిగిన మాదిగ, ఉప కులాల ప్రజలు బీజేపీని రాజకీయంగా భూస్థాపితం చేస్తారని,హెచ్చరించారు. అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. మాదిగల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి అని జాం గారి రవి కేంద్ర
ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఎంఆర్ పిఎస్ జిల్లా అధ్యక్షుడు సింగపగ జంగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కర్రే కృష్ణయ్య, నాయకులు బాలరాజు, కుమార్, శ్రీను, వరప్రసాద్, శివ, ప్రవీణ్, బిక్షపతి విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు.