రాష్ట్రంలో అన్ని కులసంఘాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు . శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ అన్ని కుల సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే చాలా సంఘాలకు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్, కార్పొరేటర్లు జంగిలి ఐలేందర్ యాదవ్, భూమా గౌడ్, గుగ్గిళ్ల జయశ్రీ-శ్రీనివాస్,నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చల్ల హరి శంకర్ గౌడ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.