Friday, September 20, 2024
HomeతెలంగాణSeethakka: యువజన కాంగ్రెస్ దే కీలక పాత్ర

Seethakka: యువజన కాంగ్రెస్ దే కీలక పాత్ర

యువత పార్టీని ముందుండి నడిపించాలి

రానున్న శాసనసభ ఎన్నికలలో యువజన కాంగ్రెస్ నాయకులే కీలక పాత్ర పోషించాలని, నియోజకవర్గంలోని ప్రజలే నా కుటుంబ సభ్యులను ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు. స్థానిక డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోతు రవిచందర్ అధ్యక్షతన యువజన కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికలు డబ్బు సంచులకు ప్రజాసేవకు మధ్య పోటని, ప్రజా సేవ చేస్తున్న తనను ఓడించడానికి బిఆర్ఎస్ నాయకులు డబ్బు సంచులతో వస్తున్నారని అధికార పార్టీ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకోని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పరిస్థితి ఉందని ఐదేళ్ల కిత్రం నిరుద్యోగ భృతి పేరుతో ఓట్లు దండుకున్న కేసీఆర్‌ ఇప్పటికీ నిరుద్యోభృతిని అమలు చేయలేదని విమర్శించారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తు కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతున్నాడని మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టడం, ఓట్లు దండుకోవడం తప్ప సీఎం కేసీఆర్‌ చేసింది ఏమీలేదని అన్నారు.
యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కెసిఆర్ చేసిన మోసాలను ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని సీతక్క పిలుపునిచ్చారు. అనంతరం వివిధ గ్రామాల నుండి 100 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి మధు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వంశీ కృష్ణ, ఉపాధ్యక్షులు రాము, స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News