Thursday, September 19, 2024
HomeతెలంగాణGuvvala Balaraju: వైద్య సేవలకు ఆటంకాలు వద్దు

Guvvala Balaraju: వైద్య సేవలకు ఆటంకాలు వద్దు

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు

అచ్చంపేట పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజల, రోగుల వైద్యానికి ఆటంకం కలిగించడం శ్రేయస్కారం కాదు అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
అచ్చంపేట పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి స్పెషలిస్టులు 10 మంది డాక్టర్లు ఈరోజు మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ క్యాంపుకు ముఖ్యఅతిథిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉన్నంతలో శ్రద్ధ వహించి పనిచేసిన కారణంగా వంద డకల ఆసుపత్రి పుణ్యమా అని మొన్న జరిగిన సంఘటనలో మన్ననూరు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలు ఇక్కడే చికిత్స తీసుకొని డిశ్చార్జి కావడం జరిగిందన్నారు. ఈ హాస్పిటల్ వారిని కాపాడడానికి ఉపయోగపడడంతో పాటు పేషంట్స్, విద్యార్థినిల తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారని తెలిపారు.

- Advertisement -


రానున్న 20 రోజులలో మళ్లీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగ, దేయంగా పనిచేస్తున్నామన్నారు. రాత్రి 1:30 గంటలకు జ్వరం వేస్తే ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం జరిగిందన్నారు. కానీ కొంతమంది కావాలని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆస్పత్రి ప్రతిష్టను దిగజారే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిపై ఒరిగేది ఏమీ లేదన్నారు.
పేద ప్రజలు, పేద రోగులకు ఇబ్బందులు కలిగజేస్తే సహించేది లేదనీ, డాక్టర్లను సిబ్బందిని ద్వేషిస్తూ ఆందోళన చేయడం శ్రేయస్కారం కాదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, జెడ్పీటీసీ మంత్రీయ నాయక్, నాయకులు అమీనొద్దిన్, శంకర్ మాదిగ, మనోహర్, గణేష్, ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News