Raviteja : మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ధమాకా సినిమా ప్రమోషన్స్ తో తెగ బిజీగా ఉన్నాడు. ధమాకా సినిమా నేడు డిసెంబర్ 23న రిలీజ్ అవుతుంది. రవితేజ గత రెండు సినిమాలు నిరాశపరచడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. ఎన్నడూ లేనంతగా ఈ సినిమాకి తనే ముందుకొచ్చి ప్రమోషన్స్ చేశాడు. వరుస ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
ఇటీవల అందరు పాన్ ఇండియా సినిమా అనేస్తున్నారు. చిన్న, పెద్ద సినిమా తేడా లేకుండా నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పి వేరే రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లలో సినిమాని రిలీజ్ చేస్తే పాన్ ఇండియా సినిమా అంటున్నారు. తాజాగా రవితేజ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడాడు.
రవితేజ పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ.. పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ నేను అనుకున్నది వేరు. భారీగా సినిమాని రిలీజ్ చేస్తే అది పాన్ ఇండియా అయిపోదు. నా సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా అవుతుంది. పాన్ ఇండియా సినిమా అవ్వాలంటే కథలో కంటెంట్ ఉండాలి. కథే ఆ సినిమాని పాన్ ఇండియా సినిమా చేస్తుంది. మనం సపరేట్ గా పాన్ ఇండియా సినిమా చేయక్కర్లేదు అని అన్నారు. దీంతో రవితేజ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమలో చర్చగా మారాయి.