Saturday, November 23, 2024
HomeతెలంగాణGudem Mahipal Reddy: మోడల్ మున్సిపాలిటీగా బొల్లారం

Gudem Mahipal Reddy: మోడల్ మున్సిపాలిటీగా బొల్లారం

60 కోట్ల తో బొల్లారం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి

60 కోట్ల రూపాయల నిధులతో బొల్లారం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో ఆరు కోట్ల నాలుగు లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పరిపాలన వికేంద్రీకరణ చేయాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ పటాన్చెరు నియోజకవర్గంలో మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.

- Advertisement -

ప్రతి మున్సిపల్ అభివృద్ధికి నేటి వరకు 60 కోట్ల రూపాయలు నిధులు వెచ్చిస్తూ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ప్రతి కాలనీలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మిస్తూ మిషన్ భగీరథ మంచినీటి నల్ల కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు పూర్తి పారదర్శకతతో అవినీతి లేకుండా పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలో దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఉపాధి నిమిత్తం జీవనం కొనసాగిస్తున్నారని, వారందరూ తెలంగాణ బిడ్డలేనని అన్నారు. నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మాణం కోసం నాలుగు కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లు తెలిపారు.

త్వరితగతిన ఆధునిక వసతులతో కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రజలు పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆదరిస్తారని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అవి ఆశీర్వాదాలనీ అన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ రోజా బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు కౌన్సిలర్ చంద్రారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు, కౌన్సిలర్ హనుమంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి. వేణు పాల్ రెడ్డి. వరప్రసాద్ రెడ్డి. మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుల, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News