Friday, November 22, 2024
HomeతెలంగాణKale Yadayya: రెండో విడత చేప పిల్లల పంపిణీలో

Kale Yadayya: రెండో విడత చేప పిల్లల పంపిణీలో

బీసీ సంక్షేమానికి అభివృద్ధి పథకాలు

చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మండలం లోని బుల్కాపూర్, గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అన్నదన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బుల్కపుర్, ప్రొద్దుటూరు గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత చేపల పంపిణీలో పాల్గొనీ బుల్కపుర్, ప్రొద్దుటూరు చెరువులో 1 లక్ష చేప పిల్లలను పంపిణి చేసిన ఎమ్మెల్యే యాదయ్య దేశానికే ఆదర్శంగా తెలంగాణ బీసీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు కాలే యాదయ్య ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతుంది అన్నారు.

- Advertisement -

తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తున్నామని మన ముఖ్యమంత్రి అన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి ఎంపీపీ ధర్మన్న గారి గోవర్ధన్ రెడ్డి ,జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, 5వ వార్డ్ కౌన్సిలర్ జూలకంటి లక్ష్మమ్మ రాంరెడ్డి పొద్దుటూరు గ్రామ సర్పంచ్ ఏనుగు నరసింహారెడ్డి మరియు ఎంపీటీసీ ప్రవళిక వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విష్ణువర్ధన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News