నంద్యాల జిల్లా చాగలమర్రి మండల పరిధిలోని శెట్టివీడు గ్రామంలో వినాయక చవితి రోజున ప్రారంభించిన సమరసత సేవా ఫౌండేషన్ “బాలవికాస్” కేంద్రాన్ని జిల్లా బాలవికాస్ కన్వీనర్ తిమ్మారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలవికాస్ కేంద్రాలలో పనిచేయుటకు ఎంపిక చేసిన మాతాజీ, ఆచార్యులకు తిరుపతి తిరుమల దేవస్థానం నందు గత నెలలో శిక్షణ ఇచ్చారన్నారు. ఇక్కడికి వచ్చే పిల్లలు పూర్తి క్రమశిక్షణగా భారతీయ సంస్కృతిని, పెద్దలు తల్లిదండ్రులు, గురువులు, తోటి వారి పట్ల గౌరవం, మర్యాద తెలుసుకునేలా ఎదగడానికి, పాఠశాలలో చెప్పిన అంశాల సందేహాలను తీరుస్తూ పిల్లల మనోభావాలను వికసింప చేసేలా నంద్యాల జిల్లాలోప్రస్తుతం 21 బాల వికాస్ కేంద్రాలు పనిచేస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నారి సల్లా జైశుక్ అక్కడ ఉన్న దాదాపు 30 మంది పేద విద్యార్థులకు బ్రష్ పేస్టు పంపిణీ చేశారు. ఎస్ ఎస్ ఎఫ్ కన్వీనర్ వీరం రెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే పిల్లలకు వారి పరిశుభ్రం గురించి ఆరోగ్యం గురించి ప్రతి వారం దాతల సహాయంతో ఇలాంటి బహుమతులు పిల్లలకు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోజన ప్రముఖు రమణయ్య, ధర్మ ప్రచారక్ నరసింహ SSF శెట్టివీడు గ్రామ కన్వీనర్ శంకరాచారి, సల్ల ధనంజయుడు, SC,St కన్వీనర్ కశినేని ఓబులేసు దేవాలయ కమిటీ అధ్యక్షుడు చిన్నయ్య, మాతాజీ శకుంతల, కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.