Friday, October 18, 2024
Homeహెల్త్Immunity boosters: రోగ నిరోధక శక్తిని పెంచుకునే సీక్రెట్స్

Immunity boosters: రోగ నిరోధక శక్తిని పెంచుకునే సీక్రెట్స్

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే పదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా,బలంగా ఉంటుంది. అవి…

- Advertisement -

 పసుపు కలిపిన పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. గోరువెచ్చని పాలల్లో పసుపు వేసుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

 లవంగాల వల్ల జలుబు, దగ్గు తగ్గడమే కాదు ఇన్ఫెక్షన్లు దరిచేరవు. ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అంతేకాదు వీటిల్లోని యాంటాక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

 తులసి, అల్లం మిశ్రమం తీసుకోవడం వల్ల దగ్గు, తలనొప్పి, జలుబు, జ్వరం తగ్గుతాయి.

 దాల్చిన చెక్క కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్ గుణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

 ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్, ఆర్సెనిక్ లు కూడా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ ఒక ఆమ్లా తింటే రోగాలు దరిచేరవు. అందుకే ప్రతి రోజూ ఒక ఉసిరి తినాలి.

 చేపనూనె, ఆకుకూరలు, నట్స్, మసాలా, రకరకాల సీడ్స్, సిట్రస్ పళ్లు, గుడ్లు, పెరుగు వంటివి కూడా శరీరంలో రోగనిరోధకశక్తిని బాగా పెంచుతాయి.

 వెల్లుల్లి, అల్లం కూడా శరీరంలో ఇమ్యూనిటీని బాగా పెంచుతాయి.

 పాలకూరలో సి విటమిన్ తో పాటు యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లపై బలంగా పోరాడి రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తాయి.

 బాదం, సన్ ఫ్లవర్ విత్తనాలలో యాంటాక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉండి శరీరంలో రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. బొప్పాయిలో సి విటమిన్ ఉంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

 గ్రీన్ టీ, బ్లాక్ టీలలో యాంటాక్సిడెంట్లు బాగా ఉండి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News