Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: మృతదేహాన్ని తీసుకెళ్లటమంటే నరకమే..

Nandyala: మృతదేహాన్ని తీసుకెళ్లటమంటే నరకమే..

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి

జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ ని కలిసి గిరిజన ప్రాంతాల్లో, తండాల్లో, ఎస్టి గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు స్మశాన వాటిక స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. ఈ సందర్భంగా రాజు నాయక్ మాట్లాడుతూ వెలుగోడు మండలం జమ్మి నగర్ తండాలో పూర్వం నుండి దాదాపు 40 సంవత్సరాల పైబడి తండావాసులు నివసిస్తున్నారని, ఎవరైనా మృతి చెందితే పూడ్చడానికి కూడా ఏక్కడ వీలు లేకుండా ఉందన్నారు అదేవిధంగా గిరిజనులు మృతిచెందితే దహన సంస్కరణ చేయడానికి గాలేరు నది దాటి వెళ్లాల్సిందే, మృతదేహాన్ని తీసుకొని గాలేరు నది లో నుంచి నడుచుకుంటూ పోతున్నామని, భుజం వరకు నీళ్లు తగలడంతో ఆ తండావాసులు నరకయాతన అనుభవిస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఎన్నో మార్లు తాసిల్దార్ కు మొరపెట్టుకున్న పట్టించుకోకపోగా కనీసం గిరిజన సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. జమ్మి నగర్ తండా సమస్యపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని తీసుకెళ్లే గాలేరు నదిలో వంతెన వేసి కల్వర్టు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ను విన్నవించారు. మృతదేహాన్ని తీసుకొని వాగు దాటాలంటే భుజం వరకు నీరు తగులుతుందన్నారు.ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామాన్ స్పందన కార్యక్రమంలో నుంచి వెలుగోడు తాసిల్దార్ కు ఫోన్ చేసి జమ్మి నగర్ తండాలో స్మశాన వాటిక స్థలం విషయంపై, తండావాసులు పడుతున్న అవస్థల పై అడిగి తెలుసుకున్నారు వాటిని వెంటనే పరిష్కారం చేసి తండా వాసులకు న్యాయం చేయాలని తాసిల్దార్ కు ఆదేశించడం జరిగింది. స్పందించిన కలెక్టర్ కు జిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిపిఎస్ సలహాదారుడు నగేష్ నాయక్, లక్ష్మణ్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపిఎస్ సలహాదారుడు నగేష్ నాయక్, జమ్మి నగర్ తాండ వాసి లక్ష్మ నాయక్, విక్రమ్ నాయక్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News