నేషనల్ కరాటే పోటీల్లో గౌతమి హై స్కూల్ విద్యార్థులు జయకేతనం ఎగుర వేసినట్లు హైస్కూల్ కరస్పాండెంట్, ఖమ్మంపాటి భిక్షపతి గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొండమల్లయ్య భూదేవి గార్డెన్ నందు ఆదివారం 37వ నేషనల్ షోటో కాన్ కరాటే టిహెచ్ ఆర్ కప్ 2023 పోటీలలో నకిరేకల్ పట్టణానికి చెందిన గౌతమి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థిని, విద్యార్థులు ఎమ్, మనీష్ కుమార్, వి, వెన్నెల, మొదటి బహుమతి సాధించారని, గోల్డ్ మెడల్ ను ఆర్, ఉషా ప్రియా, ద్వితీయ బహుమతి సిల్వర్ మెడల్స్ తో పాటు ప్రశంసా పత్రాలను పొందారని తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని ప్రస్తుత ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరు ఆత్మ రక్షణ కొరకు కరాటేను నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కె, భిక్షపతి గౌడ్,డైరెక్టర్ సంధ్యలు, విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఆర్, విజయ్ కుమార్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.