Saturday, October 5, 2024
HomeతెలంగాణNiranjan Reddy: పల్లెలు అభివృద్ది చెందితేనే దేశాభివృద్ది

Niranjan Reddy: పల్లెలు అభివృద్ది చెందితేనే దేశాభివృద్ది

పటిష్టమైన ప్రణాళికతో గ్రామాల అభివృద్ది

పల్లెలు అభివృద్ది చెందితేనే దేశాభివృద్ది జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖిల్లాఘణపురం మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ది, శంకుస్థాపన పనులను శ్రీకారం చుట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భావి తరాల భవిష్యత్ కు బాటలు వేస్తున్నామని,సాగునీరు, తాగునీరు రాకతో పల్లెల్లో సమగ్రాభివృద్ధి జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ నంబర్ వన్ అని,వలసలు పోయిన నేలకు ఉపాధి కోసం వలసలు వస్తున్నారని గుర్తు చేశారు. పటిష్టమైన ప్రణాళికతో గ్రామాలను అభివృద్ది చేస్తున్నామని, గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని, పదేళ్లలో దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలబెట్టమని అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదనీ అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News