Tuesday, May 20, 2025
HomeతెలంగాణSankarpalli: టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్, బిజెపి నేతలు

Sankarpalli: టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్, బిజెపి నేతలు

మాతో కలిసి ప్రజాసేవ చేసేందుకు సిద్దం

తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై తమతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నుంచి పలువురు కార్యకర్తలు వలస వస్తున్నారని ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. శంకర్ పల్లి మండలం మహాలింగాపురం గ్రామ కాంగ్రెస్, బిజెపి నేతలు శంకర్ పల్లి జెడ్పీటీసీ చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మాణిక్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 50 మంది యువత ఇతర పార్టీల నుంచి అధికార బీఆర్ఎస్ లోకి చేరారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలను చూసి ముగ్దులై ప్రజాసేవకు మా వంతు సహాయం అందిస్తామని స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువల వస్తున్నారని వివరించారు.

ఈసారి కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహాలింగాపురం గ్రామం సర్పంచ్ మాణిక్ రెడ్డి, ఎంపిటిసి యాదగిరి, మాజీ సర్పంచ్ చంద్రయ్య టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News