Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి

Kurnool: పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి

జిపిఎస్ వద్దేవద్దు- ఓ పి యస్ ముద్దు

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించి సి పీ ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. ప్రతిపక్ష నేతగా పాద యాత్రలో ఊరు ఊరు తిరుగుతూ మేము అధికారంలోకి వస్తే ఒక వారం లోపే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చి ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ కమిటీలతో కాలయాపన చేసి చివరకు గ్యారంటీ లేని జిపిఎస్ ను అమలు చేయ ప్రయత్నం చేయడం,ఇచ్చిన మాటను మరచి , మడమతిప్పి మంత్రి మండలి ఆమోదాన్ని తెలపడాన్ని నిరసిస్తూ ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు కర్నూలు ఎదుట జిల్లా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కే. ప్రకాష్ రావు, ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ హృదయ రాజు, కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎస్. గోకారి, సెక్రెటరీ జనరల్ జీ.తిమ్మప్ప , ఏపీ సిపియస్ ఈఎ గౌరవ అధ్యక్షుడు లింగారెడ్డి , జిల్లా ఫోర్టో చైర్మెన్ ధనుంజయ రెడ్డిల నాయకత్వంలో సోమవారం ఉదయం 10 గంటలకు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. చలో కలెక్టరేట్ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ యస్.గోకారి అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ సిపిఎస్, ఓపీఎస్ ముగిసిన అధ్యాయాలు అని, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కొరకు రాష్ట్రంలో కలసి వచ్చే అన్ని ఉద్యోగ సంఘాల ను కలుపుకొని రాష్ర్ట ఫ్యాప్టో ముందుకు వెళుతుందని ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమం కోరే సంఘాలూ అన్ని ఈ ఉద్యమంలో కలసి రావాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో రాష్ర్ట కార్య వర్గ సభ్యుడు జి హృదయ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ లేకుండా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో జి పి ఎస్ తేవడం దారుణమని, ప్రభుత్వములకు ఉద్యోగ మరియు ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు. జిల్లా ఫ్యాప్తో ఛైర్మన్ యస్.గోకారి మాట్లడుతూ ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన ఒక వారంలోపే సిపిఎస్ ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెస్తామని హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ సిపిఎస్ ను రద్దు చేసి ఓ పి ఎస్ నుఅమలు చేయకుండా గ్యారెంటీ లేని జిపిఎస్ ను తెస్తూ మంత్రిమండలి ఆమోదాన్ని తెలిపి త్వరలో శాసనసభలో బిల్లు పెడతామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏరు దాటే వరకు రాజన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్లు ఈ ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శించారు.

- Advertisement -


యు టి ఎఫ్ రాష్ర్ట కార్యదర్శి సురేష్ మాట్లడుతూ ఎన్నికల ముందు ఎటువంటి హామీలు ఇవ్వకుండానే రాజస్థాన్, ఛత్తిస్ ఘడ్, పంజాబ్ ,హిమాచల్ ప్రదేశ్, సిక్కిం తదితర రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగుల, ఉపాధ్యాయుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేశారన్నారని అక్కడ అమలుకు సాధ్యమైనటువంటిది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని, ప్రశ్నించారు. ఏ పి సి పి ఎస్ ఇ ఎ జిల్లా గౌరవ అధ్యక్షుడు లింగారెడ్డి మాట్లాడుతూ కాంట్రిబ్యూషన్ లేనటువంటి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . శాసనసభలలో బిల్లు పెట్టిన రోజునే కలిసివచ్చే అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కలిసి అసెంబ్లీ ముట్టడికైనా వెనకాడబోమని సెక్రెటరీ జనరల్ జి తిమ్మప్ప హెచ్చరించారు. యస్.టి.యు రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి సి.నాగ రాజు మాట్లాడుతూ మొండిగా ప్రభుత్వం జిపిఎస్ కు ఆమోదం తెలిపితే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు వారి కుటుంబాలు మొత్తం 70 లక్షల మంది ఓటర్లు ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఫోర్టో నాయకులు ధనుంజయ రెడ్డి లు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి సమస్యలు పిఆర్సి బకాయిలు డిఏ బకాయిలు జెడ్పిపిఎఫ్ ఏపీ జి ఎల్ ఐ రుణాలు ఫైనల్ చెల్లింపులు సరెండర్ బిల్లుల మంజూరు కొరకు ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసనలు ,ధర్నాలు , ఏర్పాటు చేయబోతే అక్రమంగా గృహనిర్బంధం చేయడం, అరెస్టులు చేయడం , బైండోవర్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్న ప్రభుత్వాలకు తగదన్నారు. ఈ ప్రభుత్వం కూడా నిరసనలు ధర్నాలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని అధికారంలోకి వచ్చినాయన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.

ఏ పి టి ఎఫ్ 257 రాష్ర్ట కార్యదర్శి రవి కుమార్ మాట్లాడుతూ సి పి ఎస్ లో కంటె జి పి ఎస్ లో ఉద్యోగులకు ఎక్కువ నష్టం ఉందని ఆన్నారు. ఆప్తా రాష్ట్ర కార్యదర్శి మధుసూధన్ రెడ్డి మాట్లడుతూ పాత పెన్షన్ విధానం కావాలన్న ఉద్యోగుల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించి వెంటనే మంత్రి మండలి ఆమోదం పొందిన జి పి ఎస్ బిల్లును వెనక్కు తీసకోవాలని ఆన్నారు. డి టి ఎఫ్ రాష్ర్ట కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లడుతూ ఈ ఉద్యమంను ఇంకా ఉదృతం చేస్తాం అని అన్నారు. ఈ ముట్టడి కార్యక్రమం లో ఫ్యాప్టో సభ్య సంఘం నాయకులు యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నాయకులు ఎస్ జయరాజు, ఎల్లప్ప, హేమంత్ కుమార్, ఇబ్రహీం, గోకారి, యస్ ఎస్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.కే జనార్ధన్ ఏపీటీఎఫ్ 257 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి నాగరాజు, ఎం రంగన్న, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యస్. ఇస్మాయిల్, మర్యానందం ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శులు వై నారాయణ , డి టి ఎఫ్ నాయకులు కరే కృష్ణ,
బిటిఏ నుండి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్షులు బి.భాస్కర్, సుధాకర్, ఆప్తా నుండి సేవా నాయక్, మధుసూదన్ రెడ్డి , ఏపీ సిపిఎస్ ఈ ఏ నుండి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. ముట్టడి కార్యక్రమం ఆనంతరం స్పందన లో వున్న కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నారాపురెడ్డి మౌర్య ని రాష్ట్ర, జిల్లా నాయకులు కలసి సమస్యను వివరించి వినతి పత్రం సమర్పించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News