Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: కలెక్టర్ కార్యాలయం ముట్టడి

Nandyala: కలెక్టర్ కార్యాలయం ముట్టడి

కదం తొక్కిన నిరుద్యోగులు

విద్యారంగా నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత విద్యార్థి ప్రతి సమస్య నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని దాదాపు 600 మంది విద్యార్థులు నిరుద్యోగులుతో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు ముట్టడించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డక్క కుమార్, నిరంజన్ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధు శేఖర్, లక్ష్మణులు డివైఎఫ్ఐ నంద్యాల కార్యదర్శి శివ మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత నెల 21వ తారీకు నుంచి ఈనెల 1వ తేదీ వరకు జిల్లాలోని 29 మండలాలు తిరిగి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం జరిగిందని అన్నారు. కొత్తగా ఏర్పాటైన నంద్యాల జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, జిల్లాలో ఒక్క మహిళా డిగ్రీ కళాశాలలో కూడా లేకపోవడంతో విద్యార్థినీలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని మహిళా డిగ్రీ కళాశాల ఉన్న ప్రైవేట్ మహిళా డిగ్రీ కళాశాలు ఉండటం ద్వారా మహిళా డిగ్రీ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని ఎలాంటి అనుమతి లేకుండా హాస్టల్లో నడుపుతున్నారని వెంటనే నంద్యాల జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక మహిళ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -

నంద్యాల జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాధుడే లేరని నేటి ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ చార్జీలు పెంచాలని, రెగ్యులర్ వార్డెన్ ఏర్పాటు చేసి వంట మనిషి, వాచ్మెన్, టుటర్లను ప్రభుత్వం నియమించాలని కోరారు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వాలి, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని,కాళిగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలి. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. మెగా డీఎస్సీ ఏర్పాటు చేయాలని, ఎస్సై ఈవెంట్స్ మెయిన్స్ పరీక్షకు మధ్య మూడు నెలలు గడువు ఇవ్వాలని డిమాండ్స్ చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిరుద్యోగ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్దమౌతాం సీఎం కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మధు కిరణ్, అశోక్, ప్రతాప్, మహేష్, మధు జనార్ధన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News