Saturday, November 23, 2024
Homeనేరాలు-ఘోరాలుTandur: పాము కాటుకు మందు లేదా ?

Tandur: పాము కాటుకు మందు లేదా ?

వైద్యుల నిర్లక్ష్యంతోనే మతిన్ మృతిచెందాడు

పేరుకే జిల్లా ఆస్పత్రి… వైద్య సేవలు అంతంత మాత్రాన. పాము కాటుకు మందు లేదా…? జిల్లా ఆస్పత్రిలో పాము కాటుకు మందు లేదని వినటానికి సిగ్గుచేటని స్థానిక ప్రజలు విమర్శించారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని 2వ వార్డు బెగ్గర్ కాలానికి చెందిన బిసి సంఘం సభ్యులు మహమ్మద్ మతిన్ కి సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పాము కాటుకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాము కాటుకు సంబంధించిన మందు లేదని అక్కడ వైద్యులు చికిత్స నిమిత్తం  హైదరాబాకు రిఫర్ చేయడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాండూరులోని  ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి భేష్, ఇక్కడ వైద్య సేవలు మరింత భేష్ అని నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు చెప్పడం విన్నాం కానీ  తాండూర్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పాముకాటుకు మందు లేకపోవడం అత్యంత దారుణమని, సిగ్గుపడాల్సిన విషయమని పలువురు విమర్శిస్తున్నారు. పాము కాటుకు మందు లేదని చెప్పి, వైద్యం నిరాకరించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా ఆస్పత్రి వైద్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం బిసి సంఘం ఆధ్వర్యంలో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ముందు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మతిన్ మృతిచెందాడు అని నిరసన చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్ సంతోష్, జిల్లా ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెన్డెంట్ డాక్టర్ మూర్తి లపై చర్యలు తీసుకోవాలంటూ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు,  కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News