Saturday, November 23, 2024
HomeదైవంAhobilam: 108 దివ్య క్షేత్రాలలో అహోబిల క్షేత్రం దివ్యమైనది

Ahobilam: 108 దివ్య క్షేత్రాలలో అహోబిల క్షేత్రం దివ్యమైనది

12 కులాల అన్నసత్రాలకు స్థలాలు పంపిణీ చేసిన గంగుల

గత 12 సంవత్సరాల నుండి నిత్య అన్నదాన సత్రాలకు సంబంధించిన స్థలాల సమస్య ఉండేదని ఆ సమస్యను అహోబిలం పీఠాధిపతి శ్రీ శ్రీ వన్ శఠగోప యతేంద్ర మహదేశికన్ ఆశీర్వాదాలతో 12 కులాలకు సంబంధించన అన్న సత్రాల స్థల సమస్యలకు పరిష్కారము లభించిందని మాజీ పార్లమెంటు సభ్యులు గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం అహోబిలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి అహోబిలం పీఠాధిపతిని కలిసి 12 కులాల సంబంధించిన అన్నదాన సత్రాల స్థలాలపంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పీఠాధిపతి ఆశీస్సులతో ఆయన సమక్షంలో మాజీ ఎంపీ గంగుల కుల పెద్దలకు సత్రాలకు సంబంధించిన 2. ఎకరాల 12 సెంట్లు స్థలాలను వారందరి అంగీకారంతో ఆమోదయోగ్యమైన పత్రాలను కులాలవారీగా మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి అందజేశారు. అందుకు జీయర్ స్వామికి మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డికి కుల పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

ఈ సందర్భంగా మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి మాట్లాడుతూ చాలా మహోత్తరమైన కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తూ ఉన్న సమస్యను ఈరోజు పూర్తయిందని ఈరోజు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. అంగీకారం తెలిపిన కుల పెద్దలందరూ సత్రాలు నిర్మించుకోవడానికి 15 రోజులలోపల ప్లాన్లు అప్రూవల్ ఏర్పాటు చేస్తూ వారికి సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే ఆరు నెలలలో అన్న దాన సత్రాలలో పూర్తి చేయాలని అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పీఠాధిపతి చేతుల మీదుగా సత్రాలను ప్రారంభోత్సవం చేయడానికి వీలుఉంటుందన్నారు. అన్ని కులాల సత్రాలలో ప్రతిరోజు నిత్యానదానం చేయాలని . అన్న సత్రాలు పూర్తయితే అహోబిలం అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. 2004లో ఎమ్మెల్యే ఎన్నికైన వెంటనే అహోబిలం వైపు దృష్టి పెట్టామని అహోబిలంలో అసాంఘిక కార్యక్రమాలు భక్తులు ధైర్యంగా వచ్చే పరిస్థితి లేదని వచ్చే భక్తులు భయంతో దర్శనం చేసుకుని వెళ్లే వారిని అలాంటి పరిస్థితుల్లో అహోబిలం ఎక్కడ చేయి జారిపోతుందని ఆలోచించి వెంటనే 45వ పీఠాధిపతి జీయర్ స్వామి ఆశీస్సులతో కలిసి అహోబిలం అభివృద్ధికి కృషి చేశామన్నారు గతంలో భక్తులు సంవత్సరానికి 45 వేల మంది దర్శకుంచుకునే వారని అందులో బ్రహ్మోత్సవాలకు 20 వేల పైగా భక్తులు వచ్చేవారని మా లక్ష్యం 10 లక్షల మంది భక్తులు అహోబిలం నరసింహస్వామి దర్శనానికి వచ్చే విధంగా ప్లాన్ ఏర్పాటు చేశామన్నారు. ఆ ప్లాన్ సక్సెస్ అయిందని ఇప్పుడు 20 లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారని దేవస్థానం గణాంకుల ప్రకారం తెలుస్తుందన్నారు. లక్ష్మీనరసింహస్వామి దశదిశల వ్యాపింపజేయాలని అన్ని వసతులు ఏర్పాటు కావాలని అందుకు ముఖ్యమైనది ప్రధానమైన అన్నదానమని నిత్య అన్నదానం అనేది భవిష్యత్తులో వచ్చే వాళ్లకు అన్నదామే అన్నదానమే కాకుండా వారికి సంబంధించిన రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తే భక్తులు ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆ విధంగా గతంలోనే తాము నవ అహోబిలం ఏర్పాటు చేసి అక్కడ కొన్ని కాటేజెస్ ను చేయడం జరిగిందని కానీ ముందుకు సాగడం లేదని 46వ పీఠాధిపతి అన్నదాన సత్రాలను పూర్తి చేశారని అలాగే నవ అహోబిలం కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కంకణం కట్టుకున్నారని మంచి పరిణామం అన్నారు.

అహోబిలానికి వచ్చేందుకు రోడ్ల నిర్మాణం అన్ని పూర్తయ్యాయి అన్నారు ఇంకా బాచుపల్లి నుండి రోడ్డు నిర్మాణం ఇంకా అక్కడక్కడ పూర్తి కాలేదని పూర్తి అయితే భక్తులకు ఇంకా రవాణా సౌకర్యం పెరుగుతుందన్నారు. అహోబిలానికి పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయని మఠం వారి చెరువు గండ్లేరు రిజర్వాయర్ తెలుగు గంగా మఠం వారి చెరువు వర్షాలతో కలకలలాడుతుందని అలాగే గండేరు రిజర్వాయర్లో.5 ఇంకా వెలుగోడు రిజర్వాయర్ నుండి నీటిని తెప్పించి రిజర్వాయర్ను నింపే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో అన్నిటి సమస్య ఉండదు అన్నారు అలాగే నిత్యం అహోబిలం భక్తులతో కలకడలాడుతుందని స్వామి జన్మ నక్షత్రం స్వాతికి వేలాది మంది తరలి రావాలని అహోబిల పుణ్యక్షేత్రం దివ్య మానవ వెలగాలని భక్తుల సహాయ సహకారాలు అందరి ఆశీస్సులు ఉండాలని మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి కోరారు. అంతకుముందు ఆయన అహోబిలం చేరుకున్న ఆయనకు గంగుల అభిమానులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నరసింహస్వామిని దర్శించు ఆయనకు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అహోబిలంలో అన్న సత్రాలకు స్థలాలను అన్ని కుల వర్గాలకు అంగీకార పత్రాలు అందజేసిన మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డిని ఘనంగా శాలువలతో పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మఠం ప్రతినిధి సంపత్ గంగుల భరత్ రెడ్డి ధనుంజయ రెడ్డి అమర్నాథ్ రెడ్డి, పార్థసారధి రెడ్డి కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ నాసారి వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డ వైస్ ఎంపీపీ నాసారి లక్ష్మీ నరసింహ ప్రసాద్. మోహన్. అన్ని కులాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News