Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Gonegandla: కోట్ల 22వ వర్ధంతి

Gonegandla: కోట్ల 22వ వర్ధంతి

నేటి లీడర్లకు ఆదర్శనీయుడు కోట్ల

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి 22వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన గోనెగండ్ల లోని ముప్పై పడకల హాస్పిటల్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రెడ్లను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పంపిణీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా నాయకులు బాల బ్రహ్మయ్య ఆచారి, మాజీ సర్పంచ్ రంగముని, ప్రభాకర్ నాయుడు, బాబు నాయుడు,చెన్నల్ రాయుడు, కౌలుటలయ్య నాయుడు, ఎస్ బి యునూస్, జనసేన తాలూకా నాయకుడు గానుగ బాషలు మాట్లాడుతూ కర్నూలు జిల్లా పెద్దాయనగా పిలువబడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి చనిపోయి నేటికి 22 సంవత్సరాలు అయినా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకొని పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న మచ్చలేని మహానేత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి అని అన్నారు. రాష్ట్ర దేశ రాజకీయాలలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. ఆయన విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రెండు సార్లు కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి 1955లో మొదటిసారి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, సార్లు పార్లమెంటు సభ్యులుగా, నాలుగు సార్లు కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా సేవలందించి జాతీయ నేతగా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా చేసి రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా చేసి గల్లీ నుండి ఢిల్లీ రాజకీయాలలో చక్రం తిప్పిన మహానీయుడని కొనియాడారు.

పల్లె పల్లెకు త్రాగునీరు సాగునీరు అందించడమే కాకుండా అనేక సాంఘిక సంస్కరణలు చేపట్టి మహిళల ఆత్మకూరు కోసం వారి కుటుంబాలలో వెలుగులు నింపేందుకు ఏకంగా సారాను నిషేధించిన మహోన్నతుడని కొనియాడారు. ఆయన మారుమూల గ్రామమైన లద్దగిరి లో జన్మించి దేశ రాజకీయాల్లోనే చెరగని ముద్రవేశారని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ మంత్రివర్గం లో దేశంలోనే నిజాయితీ గల నాయకులలో రెండో స్థానంలో నిలిచిన మహోన్నత వ్యక్తి అని ప్రజల కోసం 1.90 పైసలకు కిలో బియ్యం,కర్నూలు జిల్లా ప్రజల కోసం ఎల్ ఎల్ సి ఆధునికీకరణ, జిల్లాపరిషత్ స్కూళ్లు,30పడకల హాస్పిటల్స్, రహదారులు నిర్మించి జిల్లా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా చిరంజీవిగా ఉన్నాడని ఆయనకు నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గంజిల్ల పెద్దయ్య, బుడ్డప్ప, దరగలమాబు, గంజిల్ల సుధాకర్, అక్బర్ వలి, రాము, గంజిల్ల వెంకటేష్, నాయక్ షాషావలి, జనసేన నాయకులు మాలిక్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News