హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, మహిళా రైతుల సాధికారతకు ఆద్యుడు, అధిక దిగుబడులు ఇచ్చే అనేక వరి వంగడాలను కనుగొన్న రైతు బాంధవుడు ఎం ఎస్ స్వామినాథన్ మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సంతాపం వ్యక్తంచేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖా మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో పంటల సమృద్ది, ఆహార అభివృద్ధి, భద్రత, మహిళా రైతుల స్వయం సమృద్ధి కి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అయన మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటు, జీవితాంతం వ్యవసాయ అభివృద్ధి గురించే ఆలోచించిన ఆయన సేవలు అనితర సాధ్యం. అయన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి. అయన అనేక సూచనలను సీఎం కెసిఆర్ పాటిస్తూ, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేశారు. అయన కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు వెల్లడించాయి.