Friday, September 20, 2024
Homeహెల్త్Antibiotics @ kitchen: నాచురల్ యాంటీబయాటిక్స్ @ వంటిల్లు

Antibiotics @ kitchen: నాచురల్ యాంటీబయాటిక్స్ @ వంటిల్లు

ఇంట్లోని పోపుల డబ్బానే మెడిసిన్ కిట్

వంటింట్లో యాంటీబయొటిక్స్

- Advertisement -

నేచురల్ యాంటీ బయొటిక్స్…ఇవెక్కడ ఉంటాయంటారా? ఎక్కడో కాదు మీ ఇంట్లో…మీ వంటింట్లో ఉంటాయి. అవేమిటి అని ఆలోచించేస్తున్నారా? వాటిని గ్రహించడం పెద్ద కష్టమేమీ కాదు. వెల్లుల్లి, అల్లం, బొప్పాయి, గుమ్మడి గింజలు, కొబ్బరికాయ, పసుపులే. ఇవా అని ఆశ్చర్యపోతున్నారా? ఇవే. వీటిని నేచురల్ యాంటీబయొటిక్స్ అంటున్నది కూడా ఎవరో కాదు పోషకాహార నిపుణులు.


నిత్యం వెల్లుల్లిని మన వంటకాల్లో వాడుతుంటాం. ఇందులో వైద్యపరమైన సుగుణాలు కూడా ఎన్నో ఉన్నాయి. వెల్లుల్లిలో ఎలిసిన్ అనే శక్తివంతమైన యాంటిమైక్రోబియల్ కాంపౌండ్ ఉంది. ఇది వంటకాలకు పసందైన రుచులను అద్దడమే కాదు రోగనిరోధక శక్తిని సైతం పెంచుతుంది. నిత్యం మీరు తినే డైట్ లో వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకుంటే చాలు సీజనల్ వైరల్ జ్వరాలు, తీవ్ర జబ్బులు మిమ్మల్ని వేధించవు. మన వంటింట్లో నిత్యం కనపడే మరో నేచురల్ యాంటీబయొటిక్ అల్లం. ఇది ఇమ్యూనిటీ బూస్టర్. వైద్యపరమైన సుగుణాలు కూడా దీంట్లో ఎన్నో ఉన్నాయి. యాంటిపారసిటిక్ కాంపౌండ్లు అల్లంలో పుష్కలంగా ఉన్నాయి. జీర్ణశక్తి బాగుండేలా ఇవి చేయడంతో పాటు ఎలాంటి జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది. అల్లం టీ తాగినా మీరు పొందే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. నేచురల్
యాంటిబయొటిక్ గా ఇది బాగా పనిచేస్తుంది.

మరొక నేచురల్ యాంటిబయొటిక్ బొప్పాయి. ఇది రుచిలో రాజు. ఆరోగ్య నిధి కూడా. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. బొప్పాయి రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. బొప్పాయిలోని పపైన్ అనే ఎంజైము జీర్ణ క్రియ బాగా జరిగేట్టు తోడ్పడతుంది. పారసైట్స్ తో శక్తివంతంగా పోరడతుంది కూడా ఇది. మరొక శక్తివంతమైన యాంటిబయొటిక్ గుమ్మడి గింజలు. వీటి ప్రయోజనాలను తక్కువగా అంచనా వేస్తే పప్పులో కాలేసారన్నమాటే. వీటిల్లో పోషకపదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని అమినోయాసిడ్లు పారసైట్లను నిర్వీర్యం చేస్తాయి. వేగించిన గుమ్మడిగింజలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని స్నాక్ లా తినొచ్చు. ఈ గింజలను పెరుగు, సలాడ్లపై కూడా చల్లుకుని తినొచ్చు. కొబ్బరికాయ
ప్రకృతి ఇచ్చిన మరో నేచురల్ యాంటిబయొటిక్. కొబ్బరికాయలోని మీడియం చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ పారసైట్లకు పూర్తిగా పడనివి.

అంతేకాదు కొబ్బరికాయ ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాదు ఇన్ఫెక్షన్లను అత్యంత సహజంగా నిరోధిస్తుంది. వంటల్లో కోకోనట్ ఆయిల్ వాడడం ఎంతో మంచిది. కొబ్బరినీళ్లు శరీరానికి అందించే హైడ్రేషన్ ఎంతో. ఇక వంటల్లో కొబ్బరి సృష్టించే రుచుల పసందులు వేరే చెప్పక్కర్లేదు. చివరిగా పసుపు. మన వంటింట్లో ఉండే ఇది మరో సహజసిద్ధమైన యాంటిబయొటిక్. అందాలను పెంపొందించే గుణం కూడా దీనిలో ఉంది. ఇందులోని ఆరోగ్య ప్రయోజనాలు చెప్పాలంటే లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఇందులో యాంటిపారసెటిక్ గుణాలు అధికంగా ఉన్నాయి.

పసుపు లేని వంటకం ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రకృతిసిద్ధమైన మందుల దుకాణం మన భారతీయ వంటిళ్లల్లో కొలువుదీరి ఉంది..ఇక ఆరోగ్య సంరక్షణ కూడా మన ఇంటి నుంచే ప్రారంభమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News