Monday, May 19, 2025
Homeపాలిటిక్స్Mulugu: పోలీసుల అత్యుత్సాహం, పార్టీ అధ్యక్షునికి అవమానం

Mulugu: పోలీసుల అత్యుత్సాహం, పార్టీ అధ్యక్షునికి అవమానం

అలిగిన జిల్లా అధ్యక్షుడి వైపే అందరి చూపు

ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబుకు మంత్రుల పర్యటన సందర్భంగా అవమానం జరిగింది. జిల్లా పోలీసులు అత్యుత్సాహం చూపడంతో లక్ష్మణ్ బాబు ఆవేదన చెందారు. గురువారం జిల్లాలో మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ రాగా పార్టీ పరంగా లక్ష్మణ్ బాబు హెలీ ప్యాడ్ వద్దకు వెళ్లి స్వాగతం పలికారు. అనంతరం పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన సమావేశం జరుగుతున్న స్టేజి వద్దకు వచ్చి పైకి ఎక్కుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాబు స్టేజికి క్రింద 15 నిమిషాల పాటు నిలబడి ఉన్నారు. ఈ సమయంలో స్టేజిపై ఉన్న పార్టీ కార్యకర్త జిల్లా అధ్యక్షులు చూసి వెంటనే మంత్రి దయాకర్ రావుకు తెలపడంతో ఆయన స్టేజి మెట్ల వద్దకు వెళ్లి పైకి రావాలని కోరగా కొద్ది నిమిషాల పాటు తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుతూ ఒక దశలో రానని సైగ చేయడంతో దయాకర్ రావు తిరిగి గట్టిగా చెప్పడంతో స్టేజి పైకి ఎక్కారు. ముందు వరుసలో కూర్చున్న లక్ష్మణ్ బాబు రెండు నిమిషాల అనంతరం మంత్రుల ప్రసంగం అయిపోయే వరకు నిలబడి ఉన్నారు. కాగా పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త స్టేజీపై కూర్చోవడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News