Pujara : టీమ్ఇండియా నయా వాల్ ఛతేశ్వర్ పుజారా దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పుజారా 7 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 16 పరుగులు చేసిన అనంతరం పుజారా ఈ ఘనత సాధించిన భారత ఎనిమిదో బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. తద్వారా సునీల్ గవాస్కర్, సచిన్, గంగూలీ, ద్రావిడ్ వంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. తొలి టెస్టులో అజేయ శతకంతో(90,102 నాటౌట్‌తో) మెరిసిన పుజారా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 24 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు.
టెస్టుల్లో 7 వేల పై చిలుకు పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితా
- సచిన్ టెండూల్కర్ 15, 921
- రాహుల్ ద్రవిడ్ 13,265
- సునీల్ గవాస్కర్ 10,122
- వీవీఎస్ లక్ష్మణ్ 8,781
- వీరేంద్ర సెహ్వాగ్ 8,503
- విరాట్ కోహ్లీ 8099
- సౌరవ్ గంగూలీ 7,212
- పుజారా 7008
ఈ జాబితాలో ఉన్న వారిలో ప్రస్తుతం పుజారా, కోహ్లీలు మాత్రమే క్రికెట్ ఆడుతున్నారు.