Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: బాబుకు మద్దతుగా మోత మోగించిన తెలుగు తమ్ముళ్లు

Nandavaram: బాబుకు మద్దతుగా మోత మోగించిన తెలుగు తమ్ముళ్లు

నందవరంలో 'మోత మోగిద్దాం'

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చంద్ర బాబుకు మద్దతుగా నందవరం మండల తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ‘మోత మోగిద్దాం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు. మాజీ శాసనసభ్యులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం సాయంకాలం ఎక్కడి వారు అక్కడే మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబుకు మద్దతు తెలుపుతూ మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొని తప్పెట్లు, తాళాలు, విజిల్స్, గంటలు, వంట పాత్రలు తదితర సామాగ్రిలతో మోత మోగించారు. ఈ కార్యక్రమాన్ని మండల పరిధిలోని నందవరం, ముగతి, మాచాపురం తదితర గ్రామాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News