Saturday, November 23, 2024
HomeతెలంగాణSabitha Indra Reddy: చేవెళ్లకు మెట్రో కావాలని సీఎంని కోరాం

Sabitha Indra Reddy: చేవెళ్లకు మెట్రో కావాలని సీఎంని కోరాం

హిమాయత్ నగర్ లో నూతన గ్రామ పంచాయతీ భవనం

హైటెక్ సిటీకి ఆమడ దూరంలో ఉన్న చేవెళ్ల ప్రజలు మెట్రో రైలుకు నోచుకోలేక పోతున్నరని మన ప్రాంతానికి మెట్రో రైలు కావాలని పలుమార్లు ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. సర్పంచ్ మంజుల రవియాదవ్ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలాగే గ్రామ సమీపంలోని పేదలకు ఇండ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి సబితా రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. హిమాయత్ నగర్ గ్రామం నగరానికి కూతవేటు దూరంలో ఉందన్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయంకు వెళ్లాలంటే హిమాయత్నగర్ గుర్తుకు వస్తుందని సూచించారు. హిమాయత్నగర్ గతంలో చూస్తే ప్రస్తుతం అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందని అన్నారు. మంజూలరవియాదవ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ద్వారా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎన్నో జరిగాయని తెలిపారు. గ్రామానికి, పట్టణానికి అనుసంధానంగా చేస్తే ఎంతో బాగుంటుందని తెలిపారు. గచ్చిబౌలి -శంషాబాద్ మెట్రో రైల్ ప్రారంభం కావడంతో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల ప్రజలు రైళ్లు ఎక్కలేకపోతున్నారని, చేవెళ్లకు కూడా మెట్రో రైల్ను ప్రారంభించాలని ముఖ్యమంత్రిని కోరారని గుర్తు చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో షాబాద్, శంకరపల్లితో పాటు తాండూర్ పట్టణాల సమీపాలలో అనేక ఐటీ కంపెనీలు ముఖ్యమంత్రి కేసిఆర్, ఐటీ మంత్రి కేటిఆర్లు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఐటీ కంపెనీలు రావడం వల్ల నిరుద్యోగ సమస్య నిర్మూళించేందుకు ఎంతో కృషి చేసినవారు అవుతున్నారని తెలిపారు. గతంలో గ్రామాలలో చూస్తే ఇప్పుడు ఎంతో బాగుపడ్డాయని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ వెళ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ముచ్చటగా మూడవసారి ఎమ్మెల్బేను కూడా గెలిపించాలని ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. రైతులకు వెన్నంటుగా ఉంటూ నిరంతరం కరెంటు ఇస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని పేర్కొన్నారు.హిమాయత్ నగర్ లో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా మినీ అసెంబ్లీగా సమావేశం నిర్మించడం సర్పంచ్ మంజుల రవియాదవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో హిమాయత్ నగర్ సర్పంచ్ మంజుల, ఎంపీపీ నక్షత్రం జయ వంతు, జెడ్పిటిసీ కాలె శ్రీకాంత్, వైస్ ఎంపీపీ మమత, సర్పంచ్ లు స్వరూపా అండ్రూ, లావణ్య అంజిరెడ్డి, సుకన్య హరిశంకర్ గౌడ్, జనార్ధన్రెడ్డి, శోభావెం కట్రెడ్డి, కొత్త రాఘవరెడ్డి, ఉపసర్పంచ్ శ్యామ్రావు, పిఆర్ ఈ విజయకుమార్, హిమాయత్ నగర్ గ్రామ వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు జీవంతు, సుధాకర్ యాదవ్, బాలరాజ్, పరమేష్, విష్ణుగౌడ్, సతీష్ గౌడ్, మల్లేషాయాదవ్, మాలయాదయ్య, ముదిగొండ రాఘవేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీహరియాదవ్, షాద్ నగర్ లింగంయాదవ్, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News