అరుదైన ఎబి నెగటివ్ రక్తాన్ని ఇప్పటి వరకు 46 సార్లు రక్తదానం చేసి చూపించారు లయన్ వి.మధుసూదన్ రెడ్డి. ఒక వ్యక్తి జీవితంలో రక్తం అవశ్యకత, ప్రాముఖ్యతను పంచుకోవడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన భారతదేశంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్లైబ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యూనో హెమటాలజీ
ద్వారా 1975లో అక్టోబర్ 1వ తేదీన జాతీయ స్వచ్చాందా రక్తదానం దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించింది. భారతీయ వైద్యుడు మరియు పోస్ట్ గ్రాడ్యూవెట్ డాక్టర్ గోపాల్ జాలి ఇనిస్టిట్యూట్ అఫ్ఎ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ చండీగడ్లో ఎమెరిటస్ ప్రొఫెసర్ అతను రక్తమార్పిడి రంగంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నిపుణులు.
భారతదేశంలో ప్రొఫెషనల్ దాతల నుండి రక్తము అమ్మకము, కొనుగోలును నిషేధించే ప్రచారానికి నాయకత్వం వహించారు. అతను అక్టోబర్ 1న “రక్తదాన దినోత్సవం” పాటించడం ద్వారా రక్తదాన కార్యక్రమాల ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని మన దేశంలో 1975 సం నుండి వివిధ రాష్ట్రాలలోని జిల్లా కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో గత కొన్ని సం.ల నుండి లయన్ వి.మధుసూదన్ రెడ్డి లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థల ప్రతినిధిగా రక్తదానం యొక్క ప్రాముఖ్యతలను తెలుపుతూ… దానిమీద అవగాహన కల్పిస్తూ గతకొన్ని సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాలలో వందల కొలది రక్తదాన శిబిరాలు నిర్వహించి వేల యూనిట్లు స్వచ్ఛందంగా రక్తదానం సేకరించి తలసేమియా, సికిల్సెల్ వ్యాధి గ్రస్తులకు, ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి స్త్రీలకు, ప్రమాదాలు సంభవించి అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఉపయోగ పడేలా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రానికి సమకూర్చుతున్నారు.
స్వతహాగా అరుదైన ఏబి నెగిటివ్ రక్తాన్ని దాదాపు 46 సార్లు ఇప్పటివరకు స్వచ్ఛందంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందించి ప్రాణదాతగా నిలిచారు. దీనికి గాను పలుమార్లు జిల్లా కలెక్టర్ల ద్వారా, రాష్ట్ర గవర్నర్ ద్వార ప్రశంసా పత్రాలను, అవార్డులను స్వీకరించారు మధుసూదన్ రెడ్డి. జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలుమార్లు స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన రక్తదాతలను గుర్తించి వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా శాలువతో సత్కరించి ప్రశంసా పత్రాలు, రెండు సంవత్సరాల వ్యవధి లక్ష రూపాయల విలువ గల ఉచిత ప్రమాద బీమా పాలసీలను అందజేస్తున్నారు.
ప్రజలకు రక్తదానం మీద అవగాహన కల్పించుట కొరకు పూర్తి సమాచారంతో కూడిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా విడుదల చేసి, ప్రజలకు పంపిణీ చేశారు. మనదేశంలో ఇప్పటికి మన అవసరాలకు సరిపడా రక్తం యూనిట్లను సేకరించడంలో వెనుకబడి ఉన్నామని గుర్తుచేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇంకా రక్తదానం మీద అవగాహన కల్పిస్తూ అధిక సంఖ్యలో రక్తసేకరణ చేయడానికి ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.