పంచాయత్ రాజ్ శాఖలోని టెక్నికల్ వ్యవస్థలో 13 సంవత్సరాలుగా పని చేస్తున్న 32 మంది జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్లకు, గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న 1619 మంది ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు పేస్కేల్ జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే డా.బాల్క సుమన్ ను కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ సమస్యలను తెలిపి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. విప్ సుమన్ సానుకూలంగా స్పందిచారని తెలుపుతూ ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్స్- కంప్యూటర్ ఆపరేటర్లు మాట్లాడుతూ… మాయొక్క ఆరు న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలనీ తెలుపుతూ… జిల్లా స్థాయిలో పని చేస్తున్న జిల్లా ప్రాజెక్ట్ మేనజర్లకు పే స్కేల్ అమలుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ-పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లకు జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళా ఉద్యోగులందరికి వేతనముతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి. మా ఉద్యోగులందరికి ఆరోగ్య భీమా కల్పించి, మా యొక్క ఆరోగ్య భద్రతను కల్పించాలి. మా ఉద్యోగులలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగం కల్పించి, మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించే అన్ని వసతులను, సహకారమును మా ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని కోరారు.
Manchiryala: సారూ.. మాకు న్యాయం చేయరూ
కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యలు విప్ దృష్టికి