Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: చెత్త రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

Kurnool: చెత్త రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

'స్వచ్ఛత హీ సేవ'లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలి

‘స్వచ్ఛత హీ సేవ’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వాలని, కర్నూలు జిల్లాలోని గ్రామాలను చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంతో పాటు గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఎంతగానో ఉందని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. ఆదివారం “స్వచ్ఛత హీ సేవ” కార్యక్రమంలో భాగంగా కోడుమూరు గ్రామ పంచాయతీ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి, కూడలిలో ఏర్పాటు చేసిన జాతి పిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ ఘన నివాళి అర్పించారు.

- Advertisement -

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అమలు చేస్తున్న స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, మన ఇంటిని మన పరిసర ప్రాంతాలను శుభ్రంగా పెట్టుకోవడమే మనము సమాజానికి అందిస్తున్న సేవా అని అన్నారు.

ఇప్పటికే జిల్లాలోని ప్రతి గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమం కింద పారిశుద్ధ్య కార్మికులు ఇంటికి వచ్చి చెత్త సేకరణ చేస్తున్నారని అందుకు ప్రజలు కూడా సహకరించి తడి చెత్త- పొడి చెత్త ను వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. తడి చెత్త నుండి మనము సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నామన్నారు. ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లి ఉద్యమంలో చేపడుతున్నాం. ఇంకా నిబద్ధతతో పనిచేసి మన పరిసరాలను మన గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకొని గ్రామంలోని ప్రజల ఆరోగ్యాన్ని, మన సమాజాన్ని మెరుగుపరచుకోవాలన్నారు. మనము పీల్చే గాలి, మనము త్రాగే నీరు యొక్క ప్రభావం మనల్ని ప్రేరేపిస్తుందన్నారు. ప్రస్తుత సమాజంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైందని వీటిని ఎలా డిస్పోస్ చేయాలనేది ఒక ప్రణాళిక బద్ధంగా చేసుకోవాలన్నారు.

పరిశుభ్రత అనేది మన ఇంటిలోనే కాకుండా, పాఠశాలలలోనూ, కమ్యూనిటీ భవనం నందు, శుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ప్రతి రోజు ఉ.4గం.ల నుంచి సాయంత్రం దాకా ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వాటిని శుభ్రం చేస్తూ వారి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా గ్రామాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వారి కృషి మాటల్లో చెప్పివి కావని, మనమంతా ఆరోగ్యంగా ఉండడం కోసం వారు నిరంతరం కృషి చేస్తారన్నారు. వర్షా భావ పరిస్థితులలో కూడా విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

పారిశుద్ధ్య కార్మికులను మనం ఎంత గానో గౌరవించుకోవాల్సి ఉందన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం సుమారు 100 చెత్త సేకరణ వాహనాల ద్వారా చెత్తను సేకరించడం జరుగుతుందని మనం కూడా మన వంతు బాధ్యతగా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా “స్వచ్ఛత హీ సేవ” ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్, కోడుమూరు శాసన సభ్యులు, అధికారులు కావించారు. తదనంతరం ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను (క్లాప్ మిత్రాలు) బి.సువర్ణమ్మ, ఎం.అరుణమ్మ, ఎస్.ప్రమీలమ్మ, బి. సరోజమ్మ, ఎం.నాగరాజులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ దుశ్యాలువా, పూలదండతో సత్కరించారు. అదే విధంగా గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి జిల్లా కలెక్టర్ దృశ్యాలువతో సత్కరించారు. మొదటగా కూడలిలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాల జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కోడుమూరు శాసనసభ్యులు డా.జె.సుధాకర్ వేసి ఘన నివాళి అర్పించిన అనంతరం “స్వచ్ఛత హీ సేవ” కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి, జడ్పిటిసి రఘునాథ్ రెడ్డి, ఎంపీపీ రూతమ్మ, జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, ఎంపిడిఓ చంద్రశేఖర్, తహశీల్దార్ జయన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News