Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: తప్పుడు కేసులతో టిడిపి ప్రభంజనాన్ని అడ్డుకోలేరు

Emmiganuru: తప్పుడు కేసులతో టిడిపి ప్రభంజనాన్ని అడ్డుకోలేరు

టిడిపి నేత ఆరవీటి సుధాకర్ శెట్టికి కోట్ల

తప్పుడు కేసులు బనాయించి, అక్రమ అరెస్టులతో తెలుగుదేశం పార్టీ ప్రభంజనాన్ని ఆపలేరని, 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తధ్యమని మాజీ కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టిడిపి నేత ఆరవీటి సుధాకర్ శెట్టి అనారోగ్యంగా ఉండడంతో విషయం తెలుసుకున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టిడిపి నాయకుడు సుధాకర్ శెట్టిని ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఈ సందర్భంగా కోట్ల టిడిపి నేతలతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ టిడిపి శ్రేణులు ఆందోళనలు చేస్తుంటే… పోలీసులు 144 సెక్షన్, పోలీసు యాక్ట్ 30 పేరుతో అరెస్టులు నిర్బంధాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ తలపిస్తోందన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారం చేపట్టిన జగన్ కు ఓట్లు వేసినందుకు ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారని, వైసీపీకి గుణపాఠం చెప్పడానికి ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ 8 ముద్దాయిగా ఉన్న కడప ఎంపీ వై.యస్. అవినాష్ రెడ్డి ని సిబిఐ అరెస్టుకు యత్నిస్తే కర్నూలు జిల్లా పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయని పోలీసులు అడ్డుకోవడం చూస్తుంటే జగన్ సర్కార్ కు చట్టాలు చుట్టాలుగా మారిపోయావని ఆరోపించారు. జగన్ సర్కారు పాలనను ఎండగట్టే ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి బ్రిటిష్ కాలం నాటి చీకటి జీవో నెం.1 అమలుచేసి తన నిరంకుశత్వాన్ని ప్రదర్శించార ని దుయ్యపడ్డారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది రాచరిక పాలన, రాక్షస పాలన అని మండిపడ్డారు. చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఏడాదికి కనీసం రూ. 25 లక్షల ఎంట్రీ ప్యాకేజీ తో ఉద్యోగాలు కల్పించడానికి స్కిల్ డెవలప్ మెంట్ పాలసీని అమలు చేస్తే! దానిని జగన్ “స్కామ్” గా మార్చి చంద్రబాబును ఇరికించారని మండిపడ్డారు. జగన్ సర్కారు చంద్రబాబుపై ఎన్ని కుట్రలు,కుయుక్తులు పన్నినా రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క మల్కాపురం నాగిరెడ్డి, కదిరికోట ఆదెన్న, జి.అల్తాఫ్, ఉప్పర ఆంజనేయులు, బూదూరు రాఘవేంద్ర రెడ్డి, మల్కాపురం పురుషోత్తమ రెడ్డి, కడివెల్ల ఉరుకుంద గౌడ్, కె. తిమ్మాపురం కురుమన్న, దర్జీ మోషన్న ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News