Sunday, October 6, 2024
Homeనేషనల్Corona virus In India: అప్ర‌మ‌త్తంగా ఉండండి.. కోవిడ్ పరిస్థితుల పట్ల మరోసారి రాష్ట్రాల‌కు కేంద్రం...

Corona virus In India: అప్ర‌మ‌త్తంగా ఉండండి.. కోవిడ్ పరిస్థితుల పట్ల మరోసారి రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ..

Corona virus In India: చైనా, జ‌పాన్‌తో పాటు ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ బీఎఫ్‌-7 వేరియంట్ వేగంగా విస్త‌రిస్తోంది. ప‌క్క‌దేశ‌మైన చైనాలో బీఎప్‌-7 వేరియంట్ భారిన ప‌డుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతంది. దీంతో చైనాలోని ప‌లు ప్రాంతాల్లో ఆస్ప‌త్రులు రోగుల‌తో కిక్కిరిసిపోతున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య‌సైతం పెరుగుతోంది. ఇదిలాఉంటే దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బీఎఫ్‌-7 వేరియంట్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది. ప‌లు ఎయిర్ పోర్టులో విదేశాల నుంచి వ‌చ్చేవారిని క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు. వేరియంట్ వ్యాప్తి పెర‌గ‌డంతో కేంద్రం జాగ్ర‌త్త‌లు చేప‌ట్టింది. ఇప్ప‌టికే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలు, ఇత‌రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా భేటీ అయ్యారు. కొవిడ్ బీఎఫ్‌7 వేరియంట్ వ్యాప్తి పెర‌గ‌కుండా ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌ని సూచించారు.

- Advertisement -

తాజాగా శుక్ర‌వారం కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా భేటీ అయ్యారు. దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ల కట్టడికి చర్యలు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేయడం, పండగలు నూతన సంవత్సరం సందర్భంగా కోవిడ్ నియమావళిని ప్రజల పాటించేలా చూడటం, మూడో డోస్ వ్యాక్సినేషన్ వేగవంతం చేయడం, పాజిటివ్ సాంపిల్స్ ను జినోమ్ సీక్వెన్సింగ్ కి పంపించడం,ఆసుపత్రుల్లో సన్నద్ధత అంశాలపై రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులకు సూచనలు చేశారు. విదేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్రాల ఆరోగ్య‌శాఖ మంత్రుల‌కు కేంద్ర హెల్త్ మినిస్ట‌ర్ వివ‌రించారు.

ఇటీవ‌ల బీఎఫ్ 7 వేరియంట్‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్ర‌తీ ఒక్క‌రూ మాస్క్ ధ‌రించేలా చూడాల‌ని, ప‌లు జాగ్ర‌త్త‌లు సూచిస్తూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం లేఖ‌రాసిన విష‌యం విధిత‌మే. తాజాగా మరో లేఖను కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రాల‌కు అందించింది. టెస్ట్ – ట్రాక్ – ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నియమావళి పాటించడం పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకి కేంద్రం సూచన చేసింది. మాస్కులు, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం తదితర కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు ఆదేశాలివ్వాలని కేంద్రం స్ప‌ష్టం చేసింది.
రానున్న పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టాలని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News