Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభ18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. కథ పాతదే.. కథనం కొత్తగా..

18 Pages Movie Review : 18 పేజెస్ రివ్యూ.. కథ పాతదే.. కథనం కొత్తగా..

- Advertisement -

18 Pages Movie Review : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి ఇటీవల కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులని మెప్పించి ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి జంటగా ’18 పేజెస్’ సినిమాతో డిసెంబర్ 23న వచ్చారు. సుకుమార్ కథ అందించగా పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో GA2 బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ కలిపి ఈ సినిమాని నిర్మించారు.

ముందునుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై ఆసక్తి కలిగేలా చేశారు. ఇక కథ విషయానికొస్తే హీరో ఒక యాప్ డెవలపర్. అతని బ్రేకప్ కథతో సినిమా స్టార్ట్ అవుతుంది. బ్రేకప్ బాధలో ఓ పాట వేసుకుంటాడు. ఆ పాటలో హీరోకి అనుకోకుండా రోడ్డు మీద రెండేళ్ల క్రితంది ఒక డైరీ దొరుకుతుంది. బ్రేకప్ బాధలో ఉన్నప్పుడు ఆ డైరీ చదువుతూ అందులో హీరోయిన్ రాసిన దానికి కనెక్ట్ అయి తను అప్పుడే జరుగుతున్నట్టు ఫీల్ అవుతాడు.

ఆ డైరీలో ఉన్నవి చదువుతూ అది రాసిన అమ్మాయితో ప్రేమలో పడతాడు హీరో. ఆ డైరీ 18 పేజీలతో ఆగిపోవడంతో తర్వాత ఏమైంది అని హీరోయిన్ కోసం వెతకడం మొదలుపెట్టాక షాకింగ్ నిజాలు, ట్విస్ట్ లు బయటకి వస్తాయి. దీంతో హీరో షాక్ అయి ఆ అమ్మాయి కోసం ఏం చేశాడు? కలిశాడా లేదా అన్నదే కథ.

కథ సింపుల్ లైన్. అవతలి వ్యక్తి ఎవరో తెలియకుండానే ప్రేమలో పడి వాళ్ళ కోసం వెతకడం అనేది చాలా సినిమాల్లో గతంలోనే చూశాం. కానీ ఈ సినిమా కథనం కొత్తగా నడిపించాడు. మొదటి హాఫ్ మొత్తం ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించి ఇంటర్వెల్ లో ట్విస్ట్ లు ఇచ్చి సెకండ్ హాఫ్ లో కథకి కొన్ని కమర్షియల్ అంశాలని జోడించి చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు దర్శకుడు. అయితే మధ్యలో కొన్ని ట్విస్ట్ లని ఆడియన్స్ అర్ధం చేసుకోగలరు. సినిమా అంతా బాగా నడిపించి ప్రీ క్లైమాక్స్ కొద్దిగా బలహీనపరిచినట్టు ఉంటుంది. కానీ చివర్లో ఒక మంచి క్లైమాక్స్ షాట్ తో సినిమాని పూర్తి చేస్తారు.

సినిమా మొత్తం మీద ఒక్కసారి కూడా హీరో, హీరోయిన్ కలవడం కానీ, వాళ్ళ మధ్య మాటలు కానీ ఉండకపోవడం విశేషం. సినిమాకి ప్లస్ ఏదైనా ఉంటే అది అనుపమ, నిఖిల్ లు. సినిమా మొత్తాన్ని వీళ్ళిద్దరే నడిపించారు. పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసారు. అనుపమ క్యారెక్టర్ అయితే చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ గా టచ్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి. గోపి సుందర్ మ్యూజిక్, BGM అదరగొట్టాడు. 18 పేజెస్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మొబైల్స్ పక్కన పెట్టి సమాజంలో మనుషులతో ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News