Monday, June 16, 2025
HomeతెలంగాణMallapur: బాడీ ఫ్రీజర్ల వితరణ

Mallapur: బాడీ ఫ్రీజర్ల వితరణ

బాడీ ఫ్రీజర్లు డొనేట్ ..

మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముద్దం ప్రసాద్ గౌడ్ రాఘవపేట, మల్లాపూర్ గ్రామాలకు రెండు బాడీ ఫ్రీజర్లను లయన్స్ క్లబ్ మల్లాపూర్ వారికి అందించారు. బాడీ ఫ్రీజర్లను కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బి ఆర్ యస్ ఎమ్మెల్యే అభ్యర్థి డా. సంజయ్ లు రాఘవపేటలో ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కోరిక మేరకు తాను ఇచ్చిన మాట ప్రకారం రెండు బాడీ ఫ్రీజర్లు అందజేసినట్టు రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముద్దం రాజేంద్ర ప్రసాద్ ను శాలువాతో సత్కరించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు కనుక సంజీవ్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తరిస్తామని, ప్రజలకు చేరువయ్యేలా గ్రామగ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన మాట ప్రకారం తన అన్నల స్మారకార్థం రెండు బాడీ ఫ్రీజర్లను అందజేసినట్టు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్, లయన్స్ క్లబ్ మల్లాపూర్ మండల అధ్యక్షులు సంజీవ్, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News