Friday, October 18, 2024
Homeచిత్ర ప్రభKaikala Last Movie : కైకాల సత్యనారాయణ చివరి సినిమా ఇదే

Kaikala Last Movie : కైకాల సత్యనారాయణ చివరి సినిమా ఇదే

- Advertisement -

Kaikala Last Movie : ఎన్నో సినిమాలతో, వైవిధ్యమైన పాత్రలతో 60 సంవత్సరాలుగా సినిమాలతో అందర్నీ మెప్పించిన నటులు కైకాల సత్యనారాయణ గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ డిసెంబర్ 23 శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. ఆయన మరణంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయప్రముఖులు ఆయన ఇంటికి వచ్చి నివాళులు అర్పించారు.

నేడు శనివారం మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కైకాల సత్యనారాయణ దాదాపు 700 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే కైకాల సత్యనారాయణ 2013లో చివరగా జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాలో కనిపించారు. అప్పట్నుంచి సినిమాలకి దూరంగానే ఉంటున్నారు. కానీ 2019 లో మళ్ళీ రెండు సినిమాల్లో కనిపించారు.

2019లో ఎన్టీఆర్ బయోపిక్ లో కాసేపు కనిపించారు. అనంతరం చివరగా మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాలో పూజాహెగ్డేకి తాతగా నటించారు. ఆ సినిమాలో కొన్ని క్షణాలు మహేష్ బాబుతో మాట్లాడుతూ కనిపిస్తారు. అలా కైకాల చివరి సినిమా మహర్షి అయింది. చివరగా పూజా హెగ్డేకి తాతగా నటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News