రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు టీడీపీ నేత తిక్కారెడ్డి. తమ అధినేత చంద్రబాబు బయటకు వచ్చేంతవరకు మా పోరాటం ఆగదని తిక్కారెడ్డి హెచ్చరించారు..
ఈమేరకు చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ సాగిన దీక్షలో వాల్మీకి బోయ కులస్తులు పెద్దకడబూరు మండలం కన్వీనర్ బసల దొడ్డి ఈరన్న, కోసిగి మండలం కన్వీనర్ జ్ఞానేష్, బీసీ సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, చావిడి వెంకటేష్, బిసి నియోజకవర్గ అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, పంపాపతి, కురుగోడు, నాడిగేని వీరారెడ్డి, చిన్న బొంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, కాత్రికి మాజీ సర్పంచ్ చంద్ర, కామవరం మాజీ సర్పంచ్ రంగస్వామి పాల్గొన్నారు. వీరికి మద్దతుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమకాంత్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు సుధీర్ రెడ్డి, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బసప్ప, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి ఎల్లారెడ్డి, అశోక్ రెడ్డి, చిన్న తుంబలం వీరేష్ గౌడ్, ఎస్సీ సెల్ సీనియర్ నాయకులు మారెప్ప, యోబు, మైనార్టీ నాయకులు టిప్పు సుల్తాన్ సంఘీభావం తెలిపారు.